Begin typing your search above and press return to search.
వకీల్ సాబ్ తోనే పోటీనా రష్మిక!?
By: Tupaki Desk | 25 Feb 2021 3:30 AM GMTసౌత్ లోనే లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరు? అంటే రష్మిక పేరు తొలిగా వినిపిస్తుంది. ఛలో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాక ఈ అమ్మడి కెరీర్ వెనుదిరిగి చూసిందే లేదు. గీత గోవిందంతో మరో లెవల్ ని టచ్ చేసింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. టాలీవుడ్ లోనే గోల్డెన్ హ్యాండ్ గా వెలిగిపోతోంది రష్మిక.
ఇప్పుడు అటు తమిళం .. హిందీ రంగాలకు మిడాస్ టచ్ ని రుచి చూపించే పనిలో ఉంది. అదంతా సరే కానీ.. ఇటీవల క్రేజు కోల్పోయిన కార్తీకి కూడా ఇప్పుడు రష్మికనే లక్కీ ఛామ్ గా మారనుంది. మొన్నటికి మొన్న లోకేష్ కనగరాజ్ కార్తీకి ఖైదీ లాంటి హిట్టిచ్చాడు కాబట్టి అది ప్లస్ అవుతుంది. కానీ సుల్తాన్ ని యూత్ లో లేపాలంటే కచ్ఛితంగా అందులో నాయికగా నటించిన రష్మిక వల్లనే అవుతుందని ముచ్చటించుకుంటున్నారంతా.
ఏప్రిల్ 2న కార్తీ-రష్మిక జంటగా నటించిన సుల్తాన్ తెలుగు-తమిళం రెండు భాషల్లో రిలీజవుతోంది. తెలుగు వెర్షన్ కి రష్మిక పెద్ద ప్లస్ కానుంది. తనకోసమే థియేటర్లకు వచ్చే అభిమానుల వల్ల కలిసి రానుందని అంచనా. పైగా ఈ సినిమా రిలీజైన వారం రోజులకు వకీల్ సాబ్ లాంటి క్రేజీ సినిమా రిలీజవుతోంది. అంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తోనే సుల్తాన్ ఢీకొడుతోంది. ఎంతయినా వారంలోపే సుల్తాన్ తెలుగు వెర్షన్ పై పెడుతున్న 8 కోట్లు సహా వడ్డీలు సహా రాబట్టాల్సి ఉంటుంది. అది కార్తీ వల్ల అవుతుందా..? రష్మిక ప్రచార సాయం లేకపోతే!!.. అంటూ ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నట్టు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న వరంగల్ శ్రీను తనుకు తానే పోటీ పెట్టుకుని ఏప్రిల్ 2న తాను బయ్యర్ గా ఉన్న `సీటీమార్`(గోపీచంద్) ని రిలీజ్ చేస్తున్నారు. అతడి పంపిణీలో రెండు సినిమాలు ఒకే తేదీకి వస్తుండగా... తర్వాతి వారంలో క్రేజీగా వకీల్ సాబ్ ని రిలీజ్ చేస్తున్నారు దిల్ రాజు. అంటే వారంలోనే మొత్తం థియేటర్లన్నీ దిల్ రాజు చేతిలోకి వెళతాయన్నమాట. అందుకే ఏప్రిల్ 2 బెట్టింగ్ ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. రెండూ హిట్టయితేనే వరంగల్ శ్రీనుకి తాను పెట్టిన పెట్టుబడులు తిరిగి వెనక్కి వచ్చే వీలుంటుంది. ఇక ఇటీవల వివాదం నేపథ్యంలో పందెంలో నెగ్గాలంటే వరంగల్ శ్రీను చాలా ఎత్తుగడలు వేయాల్సి ఉంటుందన్న గుసగుసా వేడెక్కిస్తోంది.