Begin typing your search above and press return to search.

టైగర్ తో... పుకార్లు నిజమేనన్న రష్మిక

By:  Tupaki Desk   |   13 July 2022 7:55 AM GMT
టైగర్ తో... పుకార్లు నిజమేనన్న రష్మిక
X
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇక్కడ అక్కడ అని కాకుండా ఎక్కడ పడితే అక్కడ తెగ సందడి చేస్తోంది. సినిమాలతో పాటు ఏమాత్రం తగ్గకుండా కమర్షియల్‌ యాడ్స్ లో నటిస్తూ ఆకట్టుకుంది. అందమైన రష్మిక మందన్నా సౌత్‌ లో ఏ స్థాయిలో బిజీగా ఉందో.. అంతే స్థాయిలో బాలీవుడ్‌ లో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నట్లుగా ఆమె చేస్తున్న సినిమా లను బట్టి అర్థం అవుతుంది.

ఇప్పటికే బాలీవుడ్‌ లో పలువురు స్టార్స్ తో నటించి... నటిస్తున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు టైగర్‌ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నారు. ఇద్దరు కలిసి ముంబయిలో ఒక స్టూడియోలో ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్నారు అనే వార్తలు జోరుగా వస్తున్న నేపథ్యంలో రష్మిక మందన్నా సోషల్‌ మీడియా ద్వారా ఆ వార్తలకు మరింత స్పష్టత ఇవ్వడం జరిగింది.

ఔను టైగర్ ష్రాప్ తో కలిసి నటిస్తున్నాను... కాని అది సినిమా కాదు, ఒక కమర్షియల్‌ కోసం తాను టైగర్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నాను. ఆయనతో కలిసి నటించడం ఒక అద్భతం అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

కమర్షియల్‌ యాడ్‌ తో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయి ఈ కమర్షియల్ లో నటించేందుకు గాను రష్మిక భారీ పారితోషికం ను అందుకుందట.

త్వరలోనే సౌత్‌ ప్రేక్షకుల ముందుకు కూడా ఈ యాడ్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టైగర్ ష్రాప్‌ మరియు రష్మిక మందన్నా లు కలిసి సినిమా లో నటిస్తున్నారు అనుకున్న వారికి ఈ క్లారిటీ. రష్మిక ఇతర సినిమాల విషయానికి వస్తే త్వరలో ప్రారంభం కాబోతున్న అల్లు అర్జున్‌ పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

తెలుగు మరియు తమిళంలో రూపొందుతున్న విజయ్ సినిమా లో ఈ అమ్మడు హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. విజయ్‌ తో నటించాలి అనేది తన డ్రీమ్‌ అన్నట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది. ఆ డ్రీమ్‌ ఫుల్‌ ఫిల్‌ అవ్వబోతుంది. మరో వైపు తమిళంలో కూడా ఈ అమ్మడు వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతుంది.