Begin typing your search above and press return to search.

'భీష్మ' లో అంత చేసినా 'పుష్ప' కోసం పాట్లు

By:  Tupaki Desk   |   4 Sep 2021 4:30 PM GMT
భీష్మ లో అంత చేసినా పుష్ప కోసం పాట్లు
X
స్టార్‌ హీరోయిన్‌ అవ్వాలి అంటే కేవలం నటనలో లేదా అందంలో ఉంటే సరిపోదు. ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా ఉంటేనే స్టార్‌ గా గుర్తింపు దక్కించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఈ అమ్మడు టాలీవుడ్‌ లోనే కాకుండా బాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. నటనతో పాటు డాన్స్ లు కూడా ఇరుగదీస్తుంది అంటూ భీష్మ సినిమాలో ఈమె చేసిన డాన్స్ తో మంచి పేరును కూడా దక్కించుకుంది. భీష్మలో ఆమె కూర్చుని వేసే స్టెప్‌ ను ఎంతో మంది ప్రయత్నించి కూడా విఫలం అయ్యారు. కాని రష్మిక మాత్రం సింపుల్‌ గా వేసేసింది.

భీష్మ సినిమాలో డాన్స్ తో అదరగొట్టినా కూడా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో డాన్స్ అనేప్పటికి మళ్లీ కథ మొదలు అయినట్లుగా డాన్స్ క్లాస్ లకు వెళ్తుందట. రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత ట్రైనర్‌ వద్ద డాన్స్ ను ప్రాక్టీస్ చేస్తుంది అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అల్లు అర్జున్‌ ను డాన్స్ ల్లో అందుకోవడం అంటే కాస్త కష్టమే. అందుకే సాధ్యం అయినంత వరకు ఆయనకు దరిదాపుగా వేసేందుకు ప్రయత్నిస్తాను అన్నట్లుగా రష్మిక సన్నిహితుల వద్ద చెబుతుందట.

రష్మిక మందన్నా కేవలం పుష్ప లో మాత్రమే కాకుండా తెలుగు లో పలు సినిమాలు ఈమె ముందు ఉన్నాయి. మరో వైపు హిందీలో అమితాబచ్చన్ తో కలిసి ఒక సినిమాను ఈమె చేస్తున్న విషయం తెల్సిందే. తమిళంలో స్టార్‌ హీరోలకు కూడా ఈమె మోస్ట్‌ వాంటెడ్‌ గా మారిపోయింది. ప్రస్తుతం ఒక స్టార్‌ హీరోకు జోడీగా నటించేందుకు ఈ అమ్మడు రెడీ అవుతున్న విషయం తమిళ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ అంచనాలున్న ఈ సినిమా లు సక్సెస్‌ అయితే పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా రష్మిక పేరు దక్కించుకోవడం ఖాయం.