Begin typing your search above and press return to search.

ముంబైలో పుట్టివుంటే క‌థ వేరేలా వుండేద‌ట‌!

By:  Tupaki Desk   |   26 Nov 2022 1:30 AM GMT
ముంబైలో పుట్టివుంటే క‌థ వేరేలా వుండేద‌ట‌!
X
బుల్లితెర యాంక‌ర‌మ్మ‌లు.. ర‌ష్మీ గౌత‌మ్‌, అన‌సూయ నెట్టింట గ‌త కొంత కాలంగా త‌మ‌దైన మార్కు పోస్ట్ ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. హాట్ హాట్ ఫొటో షూట్ లే కాకుండా ప‌లు విష‌యాల‌పై ముక్కు సూటిగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మూగ‌జీవాల‌కు అన్నం పెడ‌తూ రష్మీ గౌత‌మ్ నెట్టింట వైర‌ల్ కావ‌డం తెలిసిందే. ఇక యాంక‌ర్ గా వున్న అన‌సూయ న‌టిగా మారిన త‌రువాత కూడా త‌న‌దైన స్టైల్ పంచ్ ల‌తో ట్రోల‌ర్స్ పై పంచ్ లేస్తూ వుంటుంది.

ఈ ఇద్ద‌రు క‌లిసి హాట్ హాట్ ఫొటో షూట్ ల‌తోనూ నెట్టింట గ‌త కొంత కాలంగా ర‌చ్చ చేస్తున్నారు. త‌మ‌ని ట్రోల్ చేసిన వారికి త‌మ‌దైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంట‌ర్లు వేస్తున్నారు. తాజాగా ర‌ష్మీ గౌత‌మ్ త‌న‌ని ట్రోల్ చేసిన నెటిజ‌న్ లకు దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చేసి ఓ ఆట ఆడేసుకుంది. ఎక్స‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ నుంచి రీసెంట్ గా `శ్రీ‌దేవి డ్రామా సెంట‌ర్` కు షిఫ్ట్ అయిపోయిన ర‌ష్మీ గౌత‌మ్ ప్ర‌స్తుతం మాల్దీవ్స్ కు వెకేష‌న్ కి వెళ్లింది.

అక్క‌డి అందాల‌ని ఆస్వాదించ‌డ‌మే కాకుండా త‌న‌దైన స్టైల్ లో త‌న అందాల‌ని చూపిస్తూ ప్ర‌త్యేకంగా ఫొటో షూట్ లో పాల్గొంది. వైట్ ష‌ర్ట్ వేసుకుని పై బ‌ట‌న్స్ విప్పేసి కొంటె చూపుల‌తో హీటెక్కించేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ర‌ష్మీ గైత‌మ్ కేవలం వైట్ ష‌ర్ట్ ని మాత్ర‌మే ధ‌రించి థై షో చేస్తూ హోయ‌లు పోతుండ‌టంతో కొంత మంది నెటిజ‌న్ లు ర‌ష్మీని ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

మీమ్ ల‌లో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. వీళ్లు టీవీ యాంక‌ర్లు కాదు.. హీరోయిన్ లు కావ‌డం ఎలాగో తెలియ‌క అటు ఇటూ కాకుండా మ‌ధ్య‌లో మిగిలిపోయారు` అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఈ కామెంట్ ల‌పై ర‌ష్మీ గౌత‌మ్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది.

`మీరు చెప్పింది నిజ‌మే. కానీ మీరు ఒక ముఖ్య‌మైన విష‌యాన్ని మిస్స‌య్యారు. మేమంతా తెలుగు అమ్మాయిలం. ముంబై నుంచి దిగుమ‌తి అయి వుంటే క‌థ వేరేలా వుండేది. అలా అయితే మేము కూడా టాప్ హీరోయిన్ ల జాబితాలో చేరేవాళ్లం. మ‌మ్మ‌ల్ని ఇలా అయినా ప్రోత్స‌హిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు` అంటూ చుర‌క‌లంటించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.