Begin typing your search above and press return to search.
ఈ రోజు కోసమే కదా రష్మిక ఎదురుచూస్తున్నది!
By: Tupaki Desk | 9 March 2022 1:30 PM GMTఅందాల భామలు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మొదలు బాలీవుడ్ సినిమాలు చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని గంపెడాశతో ఎదురుచూస్తూనే ఉంటారు. నిజానికి బాలీవుడ్ లో సినిమాలు నిర్మాణం పరంగా ఎక్కువ సమయం తీసుకుంటాయి. అక్కడ బలమైన పోటీ ఉండటం వలన చకచకా సినిమాలు చేసే అవకాశం కూడా అందరికీ రాదు. దక్షిణాది నుంచి ఇంతవరకూ ఎంతోమంది హీరోయిన్లు బాలీవుడ్ కి వెళ్లారు. వాళ్లలో శ్రీదేవి - జయప్రద మినహా అంతగా ప్రభావం చూపినవాళ్లుగానీ .. అంతకాలం నిలబడినవారుగానీ ఎవరూ లేరు.
ఇలియానా .. కాజల్ .. తమన్నాలకి కూడా ఈ మధ్యనే ఈ విషయం అర్థమైంది .. సౌత్ సేఫ్ జోన్ అనే విషయం స్పష్టమైంది. దాంతో ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. ఇక రష్మిక మాత్రం మంచి ఊపు మీద .. ఉత్సాహం మీద ఉంది.
హిందీలో చేసిన ఫస్టు మూవీ 'మిషన్ మజ్ను'పైనే ఆమె ధ్యాస ఉంది. ఈ రిలీజ్ డేట్ ను తాజాగా ఎనౌన్స్ చేశారు. జూన్ 10వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా ప్రకటిస్తూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆమె సిద్ధార్థ్ మల్హోత్ర జోడీగా కనువిందు చేయనుంది.
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తితో రష్మిక ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఆ డేట్ కాస్తా ఖరారైపోయింది. త్వరలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
భారీ నిర్మాణ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి శంతను దర్శకత్వం వహించాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రష్మిక ఉంది. బాలీవుడ్ ఎంట్రీకి తాను సరైన సినిమానే ఎంచుకున్నానని ఆమె భావిస్తోంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే రోజు కోసం ఎదురుచూస్తోంది.
బాలీవుడ్ సినిమా చేస్తే నేషనల్ వైడ్ దక్కే గుర్తింపు వేరు. నేషనల్ మీడియాలో తమ పేరు మారుమ్రోగిపోతుంటే వచ్చే కిక్కు వేరు. సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ, ఆ మధ్యలో పెద్ద సంస్థల నుంచి యాడ్స్ ద్వారా వచ్చే మొత్తం వేరు. అందువల్లనే బాలీవుడ్ సినిమాపై అంత ఇది ఉండటం సహజం.
కాకపోతే అక్కడ నిలబడాలంటే అందంలో ఆధిపత్యం ఉండాలి .. అదృష్టం వెంటనడవాలి .. లౌక్యంతో గెలవాలి. అప్పుడే ముందుకు సాగడం తేలిక అవుతుంది. మరి రష్మిక ఈ విషయంలో ఎంతవరకూ నెగ్గుకువస్తుందో చూడాలి.