Begin typing your search above and press return to search.
లవ్ కి టైమ్ లేదంది.. మాల్దీవ్స్ కి చెక్కేసింది
By: Tupaki Desk | 9 Oct 2022 2:30 AM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్నా సౌత్ నుండి నార్త్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె నటించి మొదటి హిందీ సినిమా గుడ్ బై విడుదల అయ్యింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. భవిష్యత్తులో హిందీలో మంచి హీరోయిన్ గా పేరు దక్కించుకునే సత్తా ఉన్న హీరోయిన్ రష్మిక మందన్నా అంటూ అక్కడి రివ్యూవర్స్ కామెంట్స్ చేశారు.
గుడ్ బై సినిమా కోసం రష్మిక కాస్త ఎక్కువ సమయంనే కేటాయించిందని చెప్పాలి. ఆ సమయంలో చాలా విషయాలను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన చిన్నారి చెల్లితో సమయం గడిపేందుకు అస్సలు వీలు పడటం లేదేని.. ఆ విషయం నాకు కన్నీళ్లు తెప్పిస్తుంది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రేమలో ఉన్నారా అంటూ ప్రశ్నించిన సమయంలో ఫ్యామిలీకి మరియు రిలేషన్ లో ఉన్న సమయంలో వారికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ నా వద్ద అంత సమయం లేదు అంటూ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసింది.
ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే స్నేహితుడు విజయ్ దేవరకొండతో కలిసి మాల్దీవ్స్ కి చెక్కేసింది. హీరోయిన్ గా రష్మిక చాలా బిజీగా ఉంది. అయినా కూడా టైమ్ కేటాయించి మరీ స్నేహితులతో మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే తాను స్నేహితులకు సమయం కేటాయించలేక పోతున్నాను అన్నది.. అంతలోనే ఇలా హాలీడే ట్రిప్ కు వెళ్లడంతో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.