Begin typing your search above and press return to search.

బ్లాక్ బికినీలో భ‌గ‌భ‌గ మ‌రిగించిన రష్మిక‌

By:  Tupaki Desk   |   10 Oct 2022 3:21 PM GMT
బ్లాక్ బికినీలో భ‌గ‌భ‌గ మ‌రిగించిన రష్మిక‌
X
గ‌త కొద్దిరోజులుగా ర‌ష్మిక మంద‌న ఒంట‌రి దీవుల విహారం సంచ‌ల‌నంగా మారింది. అయితే ఈ విహారం ఒంట‌రిగానా జంట‌గానా? అనేదే అంద‌రి సందేహం. అక్క‌డ ఒంట‌రిగా విహారం చేయ‌డం లేద‌ని త‌న‌తో పాటే ఒక ప్ర‌ముఖ యువ‌హీరోతో జంట‌గా షికార్ చేస్తోంద‌ని గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి.

అత‌డు ఉప‌యోగించిన స‌న్ గ్లాసెస్ నే తాను కూడా ధ‌రించ‌డంతో బాలా కుమారి ఇట్టే దొరికిపోయింది. విమానాశ్ర‌యంలో వెళ్లేప్పుడు విడివిడిగా క‌నిపించినా మాల్దీవుల నుంచి లోన్ లీ ఫోటోలు షేర్ చేసినా కానీ ప్ర‌స్తుతం ఈ భామ వ్య‌వ‌హారాల‌పై ఎవ‌రికీ న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. ఎవ‌రి సందేహాలు వాళ్ల‌కు ఉన్నాయి.

రష్మిక నుండి విటమిన్ సీ రోజువారీ మోతాదుకు సంబంధించిన టోన్డ్ ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారుతున్నాయి. రష్మిక గత వారం మాల్దీవుల‌ బీచ్ నుంచి అరుదైన ఫోటోల‌ను షేర్ చేస్తోంది. కొద్దిసేపటి క్రితం మరో రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. రష్మిక నల్లటి టూ-పీస్ లో ధ‌డ పుట్టించింది. బికినీ బాడీని క‌వ‌ర‌ప్ చేస్తూ పైన నార చొక్కా ధ‌రించింది. ఎండ‌లో అంద‌మైన అల్లిక‌తో ఉన్న హ్యాట్ ని ధ‌రించింది. వీట‌న్నిటికీ మించి ర‌ష్మిక అలా కాలిపై కాలు వేసుకుని కూచున్న తీరు యువ‌త‌రాన్ని ఆక‌ర్షించింది. ముఖ్యంగా ఈ బ్యూటీ థై షోస్ పై సీరియ‌స్ గా ఫోక‌స్ మ‌ళ్లింద‌ని చెప్పాలి.

నిజానికి ర‌ష్మిక కావాల‌నే ఇలా యూత్ ని టీజ్ చేస్తోంది. అదంతా సరే కానీ... ఇప్పటికీ త‌న‌తో క‌లిసి ఉన్న‌ది విజయ్ దేవరకొండ అనే విష‌యాన్ని ఇంకా ఎందుకు దాస్తోంది? ఉన్న విష‌యాన్ని ఒప్పుకునేందుకు ఎందుకు అంత‌గా భ‌య‌ప‌డుతోంది? అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో నిల‌దీస్తున్నారు.

ఇంత‌కుముందు ర‌ష్మిక ధ‌రించిన ఆ క‌ళ్ల‌ద్దాలు విజ‌య్ వే. ఇప్పుడు ఆమె ధరించిన షార్ట్ అతనిదే అని కూడా అంటున్నారు. రష్మిక ఎప్పటిలాగే అద్భుతంగా కనిపిస్తోంది. కానీ ఆ షార్ట్ అత‌నిదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇలా పోజులివ్వడం నా జీవితంలో ఒక భాగమైపోయింది! అంటూ ర‌ష్మిక సింపుల్ ట్యాగ్ లైన్ ఇచ్చినా కానీ దాని వెన‌క లోతైన ప‌రిజ్ఞానాన్ని యువ‌జ‌నం త‌వ్వి తీస్తున్నారు!!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.