Begin typing your search above and press return to search.
నల్ల కోకలో నేషనల్ క్రష్ కిరాక్ లుక్
By: Tupaki Desk | 26 Dec 2021 1:30 AM GMTహి ఈజ్ సో హ్యాండ్సమ్..! అంటూ సరిలేరు నీకెవ్వరు లో మహేష్ ని ఆటపట్టించిన రష్మిక మందన.. పుష్పరాజ్ ని టెంప్ట్ చేసేందుకు పవిట కొంగునే జారవిడిచింది. అలా కోక రైకలో డీగ్లామరస్ పాత్ర అయినా ఎంతో రక్తి కట్టించింది రష్మిక. పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాత్రలోకి పరకాయం చేసిందన్న ప్రశంసలు దక్కాయి. సామీ సామీ పాట తో ఒక ఊపు ఊపింది. అసలు రష్మిక నేషనల్ క్రష్ ఎందుకు అయ్యిందో పుష్ప హిందీ వెర్షన్ తో ఉత్తరాది వారికి క్లారిటీ వచ్చినట్టయ్యింది.
కొన్ని కారణాల వల్ల రష్మిక మందన్నను నేషనల్ క్రష్ అని పిలుస్తారు అన్న వాళ్లకు ఆ కొన్ని కారణాలు ఏమిటో తెలిసొచ్చాయి. ఇటీవల ఆమె సోషల్ మీడియా ఆధిపత్యం అదే రుజువు చేస్తుంది. ఇప్పటికే పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి తుఫాన్ సృష్టించిన పుష్ప విజయంతో రష్మిక మరింతగా దూసుకుపోతోంది. తాజాగా రష్మిక నల్ల కోకలో ప్రత్యక్షమై మంటలు పుట్టించింది.
రష్మిక నల్ల చీరను ధరించి ఎంతో హాట్ గా కనిపించింది. తాజా ఫోటోషూట్ లో స్టైలిస్ట్.. హెయిర్‌స్టైలిస్ట్.. మేకప్ ఆర్టిస్ట్ .. ఫోటోగ్రాఫర్ వివరాలను పంచుకుంటూ, ``లెట్స్ బిగిన్`` అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోషూట్ కు 14 గంటల్లోనే అనేక వ్యాఖ్యలు 2లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. అభిమానులు ఈ ఫోటోని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. లవ్ ఎమోజీలతో వ్యాఖ్యానం జోడిస్తున్నారు.
ఇక రష్మిక తన స్నేహితుడు విజయ్ దేవరకొండతో కలిసి ముంబైలోని బాంద్రాలోని ప్రముఖ రెస్టారెంట్ లో ఇటీవల కనిపించింది. రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా ముంబై మీడియాకు చిక్కారు. అప్పుడు ఈ జంట చాలా క్యాజువల్ లుక్ లో ఉన్నారు.
పుష్పలో రఫ్ అండ్ ఠఫ్ గాళ్ గా కనిపించిన రష్మిక తదుపరి మరిన్ని విలక్షణ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఆమె కనిపించనుంది. అమితాబ్ గుడ్ బాయ్ లో కీలక పాత్రను పోషిస్తోంది. ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే తెలుగు సినిమాలోనూ నటిస్తోంది.