Begin typing your search above and press return to search.

రష్మిక గ్రౌండ్ లోకి దిగితే..

By:  Tupaki Desk   |   2 July 2018 9:44 AM IST
రష్మిక గ్రౌండ్ లోకి దిగితే..
X
శాండల్ వుడ్ నుంచి టాలీవుడ్ కొచ్చి తన చిరునవ్వుతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టేసింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. కన్నడలో మొదటగా నటించిన కిరిక్ పార్టీ (తెలుగులో కిర్రాక్ పార్టీ) - తెలుగులో మొదటగా నటించిన ఛలో మూవీ సూపర్ హిట్లు కొట్టడంతో ఈ బ్యూటీకి బోలెడన్ని ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

ఈమధ్య రష్మిక క్రికెట్ కు బాగా అడిక్ట్ అయిపోయానంటోంది. ఇంతకుముందు ఈ భామకు అసలు ఈ ఆట గురించి పెద్దగా తెలియదంట. కమ్మ భరత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ లో రష్మిక క్రికెటర్ రోల్ చేస్తోంది. ముందు ఆట గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం క్రికెట్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవడం మొదలెట్టింది. జీవితంలో మొదటిసారి క్రికెట్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి దిగిన ఆమెకు ఈ ఆట అంత ఆషామాషీ ఏమీ కాదని అర్ధమైపోయింది. క్రికెట్ గురించి తెలుసుకుని కొద్దిరోజులే అయినా ఇప్పుడు ఈ ఆట తెగ నచ్చేసిందని.. దీనికి అడిక్ట్ అయిపోయానని అంటోంది రష్మిక.

క్రికెట్ రాదు కాబట్టి ముందు ఈ సినిమా చేయడానికి వెనుకాడనని అంటోంది రష్మిక. ఆ టైంలో డైరెక్టర్ కమ్మ ఈ రోల్ చేయగలవని గట్టిగా కన్విన్స్ చేశాడని.. దాంతో ఈ ఆటలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలెట్టానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు భారత ఉమెన్ క్రికెట్ టీంపై బోలెండత రెస్పెక్ట్ పెరిగిపోయిందంటోంది రష్మిక.