Begin typing your search above and press return to search.

డేటింగ్ చేస్తే తప్పేంటి- రష్మిక

By:  Tupaki Desk   |   13 Nov 2021 11:30 PM GMT
డేటింగ్ చేస్తే తప్పేంటి-  రష్మిక
X
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా హ‌వా సాగిస్తోంది ర‌ష్మిక మంద‌న‌. బాలీవుడ్ లోనూ వ‌రుస సినిమాలు చేస్తోంది. ఆమె తన బాలీవుడ్ డెబ్యూ మిషన్ మజ్ను విడుద‌ల‌ కోసం ఆస‌క్తిగా వేచి చూస్తోంది.  దాని కోసం ఆమె ప్రమోషన్ లో బిజీగా ఉంది. అందులో భాగంగానే హిందీ మీడియా ఆమెతో డేటింగ్- ప్రేమ గురించి ప్రశ్నించింది. తన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తితో డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు.. కుర్రాడితో డేటింగ్ చేయడంలో తప్పేమిటని ప్రశ్నించిన రష్మిక.. ప్రేమకు వయసు భాషా అడ్డంకులు లేవని చెప్పింది. అబ్బాయి ఎలా ఉండకూడదు అనే దాని గురించి మాట్లాడుతూ.. అబ్బాయి అమ్మాయిని మార్చడానికి లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని ఆమె ఎలా ఉంటుందో అలా ఉండనివ్వమని చెప్పింది.

రష్మిక గతంలో తన కన్నడ సహనటుడు రక్షిత్ శెట్టితో రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల వారి నిశ్చితార్థం అనంత‌రం పెళ్లి ర‌ద్ద‌య్యింది. ప్రస్తుతం బహుభాషా చిత్రం పుష్ప లో అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టిస్తున్న ర‌ష్మిక .. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది.  ఆమె అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న గుడ్ బై లో కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది.

టాలీవుడ్ లో ఆఫ‌ర్లు త‌గ్గ‌క ముందే ఇత‌ర భాష‌ల్లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ క్రేజీ తార‌గా వెలిగిపోతోంది. మూడు భాష‌ల్లో మూడు ముక్క‌లాట ఆడుతోంది ఈ బ్యూటీ. అయితే త‌న‌కు తొలి అవ‌కాశం ఇచ్చిన మాతృభాష క‌న్న‌డ‌లో మాత్రం న‌టించ‌డం లేదు.