Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాల్లో ఓవ‌ర్ చేయొద్దు ప్లీజ్!

By:  Tupaki Desk   |   14 Nov 2021 8:30 AM GMT
సోష‌ల్ మీడియాల్లో ఓవ‌ర్ చేయొద్దు ప్లీజ్!
X
సామాజిక మాధ్య‌మాల్లో టాప్ మోడ‌ల్స్ క‌థానాయిక‌ల విచ్చ‌ల‌విడి ఎక్స్ పోజింగ్ పోటోషూట్ల‌ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇటీవ‌లి కాలంలో ఇది కాస్తా హ‌ద్దు మీరుతున్న‌ట్టే క‌నిపిస్తోందన్న విమ‌ర్శ‌లున్నాయి. అయితే పోటీ ప్ర‌పంచంలో ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ అవ‌కాశాలు ద‌క్కించుకోవాలంటే ఇవ‌న్నీ త‌ప్ప‌దు. అయితే నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గానే ఉంటోంది. ఫోటోషూట్ల విష‌యంలో హ‌ద్దు మీర‌డం చాలా అరుదు.

ప్ర‌స్తుతం తెలుగు-హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న ర‌ష్మిక‌కు సామాజిక మాధ్యమాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఛలో సినిమాతో కెరీర్ ప్రారంభించిన రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం ఇష్టాల గురించి వెల్లడించింది. తన కంటే చిన్న వ్యక్తితో డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు రష్మిక ప‌రిణ‌తితో స్పందించింది. ``వయస్సు కంటే ఆ వ్యక్తి మీతో ఎలా ప్రవర్తిస్తాడు లేదా మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతాడు అనేది ముఖ్యం. వ్యక్తి మిమ్మల్ని మీలాగే అంగీకరించాలి. మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నించకూడదు. వయస్సు నిజంగా పట్టింపు లేదు`` అని తెలిపింది. అలాగే సామాజిక మాధ్య‌మాల్లో షర్ట్ లెస్ పురుషుల ప్రొఫైల్ చిత్రాలను ఇష్టపడదని ర‌ష్మ‌క వెల్లడించింది. నేను క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్లి తమను తాము ఫిట్ గా ఉంచుకునే వ్యక్తులను ఆరాధిస్తాను. ఎందుకంటే ఇది వారి అంకితభావాన్ని చూపుతుంది. కానీ మీరు దీన్ని మీ ప్రొఫైల్ చిత్రంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు? సోషల్ మీడియాలో మీ శరీరాన్ని ఎందుకు ప్రదర్శించాలో నాకు అర్థం కావడం లేదు అని అంది.

ర‌ష్మిక న‌టిస్తున్న‌ `పుష్ప: ది రైజ్` డిసెంబ‌ర్ లో విడుదల కోసం వేచి ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటించింది. బాలీవుడ్ లో మిష‌న్ మ‌జ్ను స‌హా గుడ్ బై అనే చిత్రంలో న‌టిస్తోంది. మిష‌న్ మ‌జ్నులో త‌న పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.