Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: క‌ళ్ల‌జోడుతో క‌థ‌లు ప‌డుతోంది!

By:  Tupaki Desk   |   5 April 2021 2:30 AM GMT
ఫోటో స్టోరి: క‌ళ్ల‌జోడుతో క‌థ‌లు ప‌డుతోంది!
X
లోక‌ల్ క్ర‌ష్.. అంటే ఇడియ‌ట్.. అమ్మా నాన్న త‌మిళమ్మాయి టైప్. నేష‌న‌ల్ క్ర‌ష్ అంటే ఇంకే టైప్? ఇదిగో ఇక్క‌డ క‌ళ్ల జోడుతో క‌థ‌లు ప‌డుతున్న ఈ అమ్మ‌డినే అడ‌గాలి. నేష‌న‌ల్ క్ర‌ష్ అంటే జాతీయ స్థాయిలో ఆవిడ గురించే ముచ్చ‌టించాలి. త‌న‌నే త‌ర‌చి త‌ర‌చి గూగుల్లో వెత‌కాలి. అబ్బో.. అంత ఫాలోయింగా? అంటే.. ర‌ష్మిక నే స‌మాధానం చెప్పాలి.

నేష‌న‌ల్ క్ర‌ష్ అని పిలిచినందుకేనేమో.. ఇప్ప‌టికే బాలీవుడ్ లో అడుగు పెట్టేసింది. అక్క‌డ ఏకంగా సిద్ధార్థ్ మ‌ల్హోత్రా లాంటి క్రేజీ హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. మిష‌న్ మ‌జ్ను అనే స్పై థ్రిల్ల‌ర్ లో న‌టిస్తోంది. అలాగే బిగ్ బి అమితాబ్ తో ఆరంగేట్ర‌మే ఆఫ‌ర్ అందుకుంది. ఇంత చిన్న వ‌య‌సులో త‌క్కువ కెరీర్ లో ఇలాంటి క్రేజ్ ఇంకే హీరోయిన్ కి ఉంటుంది? అందుకే ర‌ష్మిక నేష‌న‌ల్ క్ర‌ష్ అయ్యింది.

ఓవైపు పుష్ప చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ ర‌ష్మిక‌నే ఎంపిక చేసుకున్నార‌ని .. చ‌రణ్ - శంక‌ర్ సినిమాకి ఈ అమ్మ‌డే ఏకైక ఆప్షన్ అని ర‌క‌ర‌కాలుగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ర‌ష్మిక ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోతోంద‌నే అర్థ‌మ‌వుతోంది.

కానీ ఇన్ స్టాలో లేటెస్టుగా గాంధీగారి క‌ళ్ల‌ద్దాల‌తో ప్ర‌త్య‌క్ష‌మై స‌ర్ ప్రైజ్ చేసిన తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది. సింపుల్ గా న‌వ్వేస్తూ నాకేమీ తెలీదు! అన్నంత అమాయ‌కంగా క‌నిపిస్తోంది ఈ క్యూటీ. అన్న‌ట్టు నేను క్యూట్ గా లేనా? అని కూడా ప్ర‌శ్నిస్తోంది. రూ.400 ఖ‌రీదైన స‌మ్మ‌ర్ డ్రెస్ లోనూ అంతే అందంగా క్యూట్ గా క‌నిపిస్తోంది క‌దూ?