Begin typing your search above and press return to search.
జూనియర్ దేవరకొండ ట్రైలర్ రష్మిక కు పిచ్చ పిచ్చగా నచ్చిందట
By: Tupaki Desk | 10 Nov 2020 6:05 PM GMTవిజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా నిరాశ పర్చిన నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకుని రెండవ సినిమాగా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే టైటిల్ తో సినిమా చేశాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అమెజాన్ లో ఈనెల 20వ తారీకున డైరెక్ట్ రిలీజ్ అవ్వబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి సొంతంగా హోటల్ పెట్టుకోవాలని చేసే ప్రయత్నాలే కథా వస్తువుగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రష్మిక మందన్నా కు విపరీతంగా నచ్చేసిందట. ఏకంగా మూడు ట్వీట్స్ చేసి తన అభిమానంను చాటుకుంది.
ట్రైలర్ పై ట్విట్టర్ లో రష్మిక.. జెన్యూన్ గా అనిపించింది. క్యారెక్టర్స్ లొకేషన్స్ కథ మేకింగ్ ఎఫర్ట్ అన్ని కూడా జెన్యూన్ గా అనిపించాయి. నేను చూశాను. చాలా నవ్వాను. ఇద్దరు నా స్నేహితులను ఇలా చూడటం చాలా సంతోషంగా అనిపించింది. నా మనస్ఫూర్తిగా ఈ సినిమాకు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఆనంద్ మరియు వర్ష మీ సినిమా తో ప్రేమలో పడిపోయాను. మీరు పోషించిన పాత్రలు నిజంగా చాలా బాగున్నాయి. అంటూ చాలా చాలానే బలమైన పదాలు.. డెప్త్ ఎక్కువ ఉన్న పదాలను వాడి మరీ సినిమాపై ప్రశంసలు కురిపించింది.

దేవరకొండ ఫ్యామిలీకి రష్మిక ఫ్రెండ్ అనే విషయం తెల్సిందే. అందుకే ఆమె ఈ సినిమాకు ఇంతగా స్పందించిందా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ లో ఉన్న మ్యాటర్ కు నువ్వు చేసిన ట్వీట్ కు సంబంధం ఉన్నట్లుగా అనిపించడం లేదు రష్మిక అంటూ మరి కొందరు కామెంట్ చేశారు. మొత్తానికి రష్మిక 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాపై చేసిన కామెంట్స్ గురించి చర్చ జరుగుతోంది.