Begin typing your search above and press return to search.
ముందే తెలిసినా సూపర్ స్టార్ కోసం చేసిందట
By: Tupaki Desk | 2 Feb 2023 11:25 AM GMTపుష్ప వంటి భారీ పాన్ ఇండియా సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నా కూడా రష్మిక మందన్నా సంతృప్తికరమైన ఆఫర్స్ ను దక్కించుకోలేక పోతుంది. బాలీవుడ్ లో ఈ అమ్మడికి ఆఫర్లు దక్కుతున్నాయి కానీ అవేవి కూడా కమర్షియల్ గా మంచి విజయాలను సొంతం చేసుకోలేక పోయాయి. ఇక సౌత్ లో కూడా పుష్ప 2 తప్ప పెద్ద ఆఫర్లు ఆమెకు దక్కలేదు.
పుష్ప 2 సినిమాలో ప్రస్తుతం నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవలే సూపర్ స్టార్ విజయ్ చిత్రం వారిసు తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సినిమా వారిసుతో కోలీవుడ్ లో టాప్ స్టార్ గా.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రష్మిక మారే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ పాపం వారిసు సినిమాలో రష్మిక పాత్ర మరీ తక్కువగా ఉంది.
వారిసులో రష్మిక పాత్ర కూరలో కరివేపాకు అన్నట్లుగా ఉండటం పట్ల ఆమె అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టార్ హీరోయిన్ గా మంచి పాత్రలు దక్కించుకోగల సత్తా ఉన్న రష్మిక మందన్నా ఎందుకు ఇంత చిన్న పాత్రకు ఓకే చెప్పిందో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది వారిసు చూసిన తర్వాత పెదవి విరిచారు.
రష్మిక మందన్నా తాజాగా వారిసులో తన పాత్ర పై వస్తున్న విమర్శలకు స్పందించింది. వారిసు కథను దర్శకుడు వంశీ పైడిపల్లి ముందుగానే నాకు చెప్పారు. కొన్ని సన్నివేశాలు మరియు రెండు పాటలకే పాత్ర పరిమితం అని కూడా తెలియజేశారు. ఐనా కూడా సూపర్ స్టార్ విజయ్ పై ఉన్న అభిమానంతో వారిసు లో నటించినట్లు రష్మిక చెప్పుకొచ్చింది.
చిన్నప్పటి నుండి అభిమానిస్తున్న స్టార్ తో నటించే అవకాశం వస్తే ఎలా వదులుకుంటా అన్నట్లుగా ఆమె పేర్కొంది. విజయ్ తో మళ్లీ మళ్లీ నటించేందుకు తాను సిద్ధం అన్నట్లుగా కూడా రష్మిక కామెంట్స్ చేసింది.
ఇక ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ కు జోడీగా యానిమల్ మరియు పుష్ప 2 సినిమాలో నటించడంతో పాటు మరో వైపు ఈ అమ్మడు నితిన్ కు జోడీగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.