Begin typing your search above and press return to search.

విజయ్ ఫోటో.. ఇన్ స్టా షేక్!

By:  Tupaki Desk   |   23 April 2019 5:41 AM GMT
విజయ్ ఫోటో.. ఇన్ స్టా షేక్!
X
కొంతమంది కాంబినేషన్ అంతే.. రచ్చ రంబోలా అవుతుంది. టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్నల జోడీ కలిసిందంటే చాలు.. కుర్రాళ్ళు వెర్రెత్తిపోతున్నారు. గీత గోవిందంలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అలా వర్క్ అవుట్ అయ్యి ప్రేక్షకులకు దగ్గర చేసింది. అందుకే వారి కాంబినేషన్ కోసం మళ్ళీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ జోడీ 'డియర్ కామ్రేడ్' సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కేరళ షెడ్యూల్ సందర్భంగా తీసిన ఒక ఫోటోను కొన్ని రోజుల క్రితం విజయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.

దానికి "కేరళ సుగామానో?.. ఫోటోగ్రాఫర్ - కామ్రేడ్ రష్మిక మందన్న" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఫోటోలో విజయ్ దేవరకొండ ఒక్కడే ఉన్నాడు. రష్మిక లేదు. అయినా విజయ్ - రష్మిక కాంబోగానే ట్రీట్ చేసిన నెటిజనులు ఇప్పటివరకూ మిలియన్ కు పైగా లైక్స్ కొట్టారు. నిజం చెప్పుకోవాలి కదా. రష్మిక ఆ ఫోటోను ఎంతో అందంగా తీసింది. నేపథ్యంలో వాటర్ ఫాల్ తో విజయ్ ను ఒక ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ లా క్లిక్ మనిపించింది. అందుకే ఈ ఫోటోకు సాధారణ నెటిజనులే కాదు.. కొందరు హీరోయిన్లు కూడా విజయ్ ను సూపర్ హ్యాండ్సమ్ అంటూ కామెంట్స్ పెట్టారు.

విజయ్ ఇప్పటివరకూ షేర్ చేసిన ఫోటోలలో ఇప్పటివరకో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న ఫోటో ఇదే. 'డియర్ కామ్రేడ్' టీజర్ లో కూడా విజయ్ - రష్మిక ల లిప్ లాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోటోకు వచ్చిన లైకులతో 'డియర్ కామ్రేడ్' పై క్రేజ్ ఎంత ఉందో అందరికీ తెలిసింది.