Begin typing your search above and press return to search.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే..!
By: Tupaki Desk | 17 Feb 2020 9:30 PM GMTచలాకీ బ్యూటీ రష్మిక మందన టాప్ సీక్రెట్ ఒకటి నితిన్ మీడియా మాధ్యమంగా లీక్ చేసేసిన సంగతి తెలిసిందే. యూత్ స్టార్ పొరపాటున నోరు జారినా ఆ తర్వాత నెటిజనులు రష్మికను ఓ రేంజులో ఆడేసుకున్నారు. ``ఆకలేస్తే రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంద``ని కోస్టార్ నితిన్ రివీల్ చేయడంతో..అమ్మడిని నెటి జనులు సోషల్ మీడియాలో ఒక రేంజులో ట్రోల్ చేశారు. హద్దు మీరిన కామెంట్లతో రష్మికను రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. హీరోయిన్ అయి ఉండి కుక్క బిస్కెట్లు తినడం ఏంటి? మనుషులు తినే బిస్కెట్లు కొన్కుక్కోలేవా? అయినా అన్ని డబ్బులు లేవా? అయినా ఇదేం అలవాటు? అంటూ వరుసగా నెటిజనులు ట్రోల్ చేసారు. ఇప్పటికీ కుక్క బిస్కెట్ లతో ఉన్న రష్మిక ఫోటోని వైరల్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ దెబ్బకి రష్మిక ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. పాపం నితిన్ చేసిన పనికి రష్మిక అడ్డంగా దొరికిపోయింది.
మరి ఈ కుక్క బిస్కెట్ల వెనుక అసలు కథ ఏంటి? ఎందుకు డాగ్ బిస్కెట్లు తినాల్సి వచ్చింది? అంతగా ఆకలిని ఆపుకోలేకపోయిందా? అంటూ మరో ఇంటర్వూలో యాంకర్ సరదాగా ప్రశ్నించగా రష్మిక వాటికి సిగ్గుపడుతూ బదులిచ్చింది. అయ్యో రామ...నేను ఒకసారే కుక్క బిస్కెట్ చిన్న ముక్క మాత్రమే తిన్నా. అది నితిన్ చూస్తుండగా నేను చేసిన పాపం. ఎవరికీ చెప్పడని అనుకున్నా. కానీ తను ఇంత సిల్లీగా తీసుకుని మీడియా ముందు ఓపెన్ అవుతాడని అనుకోలేదు. పైగా చెప్పిన తర్వాత అంత వైరల్ అవుతుందని అస్సలు అనుకోలేదు... అని ఆవేదన చెందింది.
ఇది ముందే ఊహించి ఉంటే నితిన్ పని అప్పుడే చెప్పేదాన్ని. తిండి అనే కాదు..చాలా విషయాల్లో ప్రయోగాలు చేయడం నాకు అలవాటు. కాకపోతే కుక్క బిస్కెట్ గురించి అందరికీ తెలిసిపోయింది. ప్లీజ్ .. ఇక ట్రోల్ చేయడం ఆపేయండి..ఇంకెప్పుడు డాగ్ బిస్కెట్లు ముట్టుకోనంటూ ట్రోలర్స్ ని వేడుకుంది. మొత్తానికి కుక్క బిస్కెట్ల మ్యాటర్ రష్మికని మానసికంగానూ ఎంత ఇబ్బంది పెట్టిందో ఈ వేడుకోలును బట్టే అర్ధమవుతోంది. అందుకే అంటారు... చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేంటి అని!