Begin typing your search above and press return to search.

'ఛలో' బ్యూటీని పెళ్లి చేసుకోవాలంటే అతని పర్మిషన్ కంపల్సరీ...!

By:  Tupaki Desk   |   29 April 2020 11:30 PM GMT
ఛలో బ్యూటీని పెళ్లి చేసుకోవాలంటే అతని పర్మిషన్ కంపల్సరీ...!
X
'ఛలో' చిత్రంతో టాలీవుడ్ లోకి మెరుపులా వచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. తొలి చిత్రంతోనే రష్మికకు యువత ఫిదా అయిపోయారు. 'ఛ‌లో' సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో ఛలోమంటూ దూసుకుపోతోంది. రష్మిక చిలిపితనం.. క్యూట్ నెస్ యువతకు బాగా నచ్చేసింది. అందుకు తగ్గట్లుగానే 'ఛలో' 'గీత గోవిందం' లాంటి వరుస విజయాలు దక్కడంతో రష్మికకు టాలీవుడ్ డిమాండ్ పెరిగిపోయింది. ఇక ఇటీవల రష్మిక 'సరిలేరు నీకెవ్వరు' 'భీష్మ' చిత్రాలతో సక్సెస్ అందుకుంది. దీనితో బాక్సాఫీస్ వద్ద రష్మిక జైత్ర యాత్ర కొనసాగుతున్నట్లు అవుతోంది. హీరోయిన్ రష్మిక ఆకట్టుకొనే అందమే కాదు.. సందర్భానుసారంగా స్పందిచే తెలివితేటలు కూడా ఉన్నాయని మరోసారి నిరూపించుకుంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీగా ఉంటున్న హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఫాన్స్ తో చాట్ చేస్తున్నారు. ఇంట్లోనే టైమ్ స్పెండ్ చేస్తున్న రష్మిక మందన్న అందరూ సెలబ్రెటీల లాగే ఇన్స్టాగ్రామ్ లో తన అభిప్రాయాలను ఫ్యాన్స్‌ తో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని.. 'దేవుడు వరమిస్తే మీ భర్త కావాలని కోరుకుంటాను' అని మెస్సేజ్ పెట్టాడు. దానికి రష్మిక ఫన్నీగా సమాధానం ఇచ్చింది. తన పెంపుడు కుక్క ఫోటో పోస్ట్ చేసి.. 'ముందు అతని పర్మిషన్ తీసుకో' అని స్పాంటేనియస్ గా స్పందించింది. 'భీష్మ' సినిమా ప్రమోషన్స్ టైమ్ లో రష్మిక కుక్క బిస్కెట్స్ తింటుందని నితిన్ చెప్పడంతో ఆమెని అందరూ ట్రోల్ చేసారు. అప్పటి నుండే ఆమె ఇంట్లో డాగ్స్ పెంచుతోందనే అందరికి తెలిసింది. ఇక మరో ఫ్యాన్ దిల్ వాలే సినిమాలో షారుక్ తో కాజోల్ వచ్చినట్లు నాతో 5 నిముషాలు డేట్ కి వస్తావా అని అడుగగా 'చూద్దాం' అని సమాధానం చెప్పారు. అంతేకాదు త్వరలోనే ఓ హిందీ చిత్రంలో నటించబోతున్నట్టు సమాధానమిచ్చింది. ఇక తన ఫిట్‌‌నెస్ సీక్రెట్ ఏమిటని అడుగగా.. నేను ఎంత బిజీగా ఉన్న వర్కౌట్స్ చేయడం మాత్రం మాననని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఓ అభిమాని మేము మీ సినిమాలను చూస్తున్నట్టే.. మీరు నటించిన సినిమాలను మీరు చూస్తారా అని అడుగగా.. ఇంట్లో నాకు బోలేడు పెంపుడు జంతువులున్నాయి. వాటితోనే తనకు సమయం సరిపోతుందన్నారు. ఏదేమైనా అన్ని ప్రశ్నలకు సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పి తెలివైన పిల్ల అనిపించుకుంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న 'పుష్ప'లో నటిస్తోంది.