Begin typing your search above and press return to search.

న‌క్క తోక తొక్కిన ర‌ష్మిక‌.. ఇక త‌గ్గేదేలే..!?

By:  Tupaki Desk   |   27 Sep 2022 5:27 AM GMT
న‌క్క తోక తొక్కిన ర‌ష్మిక‌.. ఇక త‌గ్గేదేలే..!?
X
తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న కన్నడ సోయగం రష్మిక మందన్నా.. గత ఏడాది విడుదలైన 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సైతం సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస పెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది.

తెలుగులో 'పుష్ప 2'లో న‌టిస్తున్న ర‌ష్మిక‌.. హిందీలో 'మిష‌న్ మ‌జ్ను', 'గుడ్ బై', 'యానిమ‌ల్‌' చిత్రాలు చేస్తోంది. త‌మిళంలో విజ‌య్ ద‌ళ‌ప‌తికి జోడీగా 'వార‌సుడు' మూవీ చేస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీని మరో బంపర్ ఆఫర్ వరించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్యాక్ టు బ్యాక్ హిట్ లతో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న తమిళ స్టార్ హీరో కార్తీ.. త్వరలోనే 'పొన్నియన్ సెల్వన్' చిత్రం తో ప్రేక్షకుల‌ను పలకరించ‌బోతున్నాడు.

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రస్తుతం కార్తీ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అలాగే కార్తీ నటించిన మరో చిత్రం 'సర్దార్'. పిఎస్. మిత్ర‌న్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ మూవీ దీపావళి కానుకగా విడుదల కానుంది.

మరోవైపు రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ ఓ సినిమా చేయబోతున్నాడు. ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'జపాన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అక్టోబర్ ఆఖరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ర‌ష్మిక‌ను సంప్రదించి స్టోరీ లైన్ వినిపించారట. స్టోరీ లైన్ విన్న ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. కాగా, కార్తీ హీరోగా తెరకెక్కిన 'సుల్తాన్' మూవీతోనే ర‌ష్మిక‌ కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. ఆ సమయంలో రష్మికను చాలా మంది ట్రోల్ చేశారు.

ర‌ష్మిక‌ వల్లే కార్తీ సినిమా ఫ్లాప్ అయిందని.. ఇక ఆమెకు కోలీవుడ్ లో ఆఫ‌ర్లు ఉండ‌వ‌ని మండిపడ్డారు. అయితే సుల్తాన్ వంటి ఫ్లాప్ తర్వాత కూడా కార్తీ మ‌ళ్లీ ర‌ష్మిక‌కు ఛాన్స్ ఇచ్చిన‌ట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ర‌ష్మిక‌ న‌క్క తోక తొక్కింద‌ని.. కెరీర్ పరంగా ఆమెను ఎవ‌రూ ఆపలేరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.