Begin typing your search above and press return to search.
రష్మిక బంగారు బాతుగా మారిందా?
By: Tupaki Desk | 1 May 2019 1:30 AM GMTఛలో - గీత గోవిందం విజయాలతో తనకంటూ తెలుగులో మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న రష్మిక మందన నిర్మాతలకు బంగారు బాతుగా మారిందా? అంటే అవుననే ఓ నిర్మాత వ్యాఖ్యానించడం ఆసక్తి ని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం రష్మిక మందన పేరు యువతరంలో మార్మోగిపోతోంది. యూత్ హార్ట్ బీట్ గా ఫీలై ఆరాధిస్తున్నారు. సరిగ్గా ఇదే అదనుగా రష్మిక ను తమ సినిమాల్లో నటింపజేస్తే .. సినిమాల కలెక్షన్స్ కి బంగారు బాతులా ఉపకరిస్తుందని మన దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.
రష్మిక లైనప్ చూస్తే ఇప్పటికిప్పుడు అరడజను క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. వీటిలో దేవరకొండ సరసన నటించిన `డియర్ కామ్రేడ్` రిలీజ్ కి వస్తోంది. తనతోనే వేరొక చిత్రానికి మైత్రిలోనే కమిటైంది. బన్ని - త్రివిక్రమ్ సినిమాతో పాటు మహేష్ - పరశురామ్ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు భన్సాలీ దర్శకత్వం లో బాలీవుడ్ ఆఫర్ తనని వరించిందని ఇటీవల వార్తలొచ్చాయి. ఇక ఈ ప్రచారం నడుమ రష్మిక నటించిన అనువాద చిత్రాలు టాలీవుడ్ కి క్యూ కడుతున్నాయి. వీటిలో తొలిగా గీతా ..ఛలో అనే చిత్రం రిలీజవుతోంది. గీతా.. ఛలో మే3న విడుదలవుతోంది. దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్ - దుగ్గివలస శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ రాజేశ్వరి ఫిలింస్ -మూవీ మాక్స్ బ్యానర్లపై ఈ చిత్రం విడుదలవుతోంది. నేడు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో పాత్రికేయుల సమావేశంలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ రష్మిక క్రేజు స్కైని టచ్ చేస్తోందని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాని సమర్పిస్తున్న దివాకర్ మాట్లాడుతూ రష్మిక నిర్మాతల పాలిట బంగారు బాతుగా మారిందని వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తించింది. గీత గోవిందంతో 100 కోట్ల క్లబ్ నాయికగా రష్మిక నిర్మాతల బంగారు బాతులా మారారు. తను నంబర్ వన్ స్థాయిలో ఉన్నారు. గీతా ఛలో పెద్ద విజయం సాధిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ -``యువతరం మెచ్చే అన్ని హంగులు ఉన్న చిత్రమిది . వీకెండ్ పార్టీలు యువతకు మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అనే పాయింట్ చుట్టూ ఉన్న కథాంశంతో తెరకెక్కింది. కన్నడలో ఛమ్మక్ పేరుతో విడుదలైన ఈ చిత్రం దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే వాయిదా వేసి మే 3న విడుదల చేస్తున్నాం. డబ్బింగ్ సినిమా అయినా స్ట్రెయిట్ చిత్రంగా దీనిని ప్రమోషన్ చేస్తున్నాం`` అని తెలిపారు. వాస్తవానికి ఈ సినిమాని `అవెంజ్స్ - ఎండ్ గేమ్` రిలీజ్ తేదీకే రిలీజ్ చేయాలని భావించినా ఆ సునామీ ముందు నిలవలేమని భావించి వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం మే 3న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఒక అనువాద చిత్రానికి తెలుగులో అంతటి ఆదరణ దక్కుతుందా లేదా? హోప్ నిలబెడుతుందా లేదా? అన్నది వేచి చూడాలి.