Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బుట్ట‌బొమ్మ కేరాఫ్ గీత‌

By:  Tupaki Desk   |   25 Jan 2019 4:44 AM GMT
ఫోటో స్టోరి: బుట్ట‌బొమ్మ కేరాఫ్ గీత‌
X
అందం నీపేరా ఆనందం నీ ఊరా
నండూరి నాయికివా శృంగార దేవతవా
నిన్ను ప్రేమించానె ఓ మైనా
అందం నీపేరా ఆనందం నీ ఊరా
రావా ఒడి చేర ప్రేమించ మనసారా

.. `చిరున‌వ్వు`తో సినిమాలోని ఈ పాట గీత‌(ర‌ష్మిక‌)కు పెర్ఫెక్ట్ యాప్ట్. ఇదిగో ఇలా `బంగారు బ్లౌజు- ప‌చ్చ ప‌రికిణీ` లో కొంటెగా కుర్ర‌కారును తెగ క‌వ్విస్తోంది. అందానికి చిరునామాగా ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ గా క‌నిపిస్తోంది. న‌టించిన తొలి సినిమా (ఛ‌లో) తోనే తెలుగు యువ‌త‌లో ఫాలోయింగ్ సంపాదించుకుని, అటుపై `గీత‌గోవిందం` నాయిక‌గా మెరుపులు మెరిపించింది. గీతను ప్రేమించ‌ని యువ‌కుడు లేడు అనేంత‌గా ఫాలోయింగ్ తెచ్చుకుంది. `దేవ‌దాసు` సినిమాలో నాని స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది.

చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ఫేం సంపాదించిన నవ‌త‌రం నాయిక‌గా ర‌ష్మిక మంద‌న పేరు మార్మోగిపోతోంది. ఇంకేం ఇంకేం కావాలే! అంటూ ఈ భామను అంతే ఇదిగో ఫాలో అవుతోంది యూత్. లేటెస్ట్ ఫోటోషూట్ లో ట్రెడిష‌న‌ల్ లుక్ లో ఈ బ్యూటీ క‌వ్విస్తోంది. ఈ ఫోటో ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అయిపోతోంది. ర‌ష్మిక కెరీర్ గ్రాఫ్ ప‌రిశీలిస్తే ఈ ఏడాది వ‌రుస‌గా నాలుగు సినిమాల్లో న‌టించేస్తోంది. గీత గోవిందం హీరో దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `డియ‌ర్ కామ్రేడ్` చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే మెజారిటీ పార్ట్ పూర్త‌యింది. క‌న్న‌డ సినిమాలు.. పొగ‌రు, య‌జ‌మాన‌, తెలుగు సినిమా భీష్మ సెట్స్ పై ఉన్నాయి. య‌జ‌మాన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది.