Begin typing your search above and press return to search.

ర‌ష్మిక కెరీర్‌ టర్నింగ్ పాయింట్ అది కాద‌ట‌

By:  Tupaki Desk   |   2 Oct 2022 2:30 AM GMT
ర‌ష్మిక కెరీర్‌ టర్నింగ్ పాయింట్ అది కాద‌ట‌
X
తొలుత క‌న్న‌డ సినిమాతో క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసిన ర‌ష్మిక ఆరంభ‌మే విజ‌యం అందుకుంది. ఆ త‌ర్వాత ఛ‌లో చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టి ఘ‌న‌విజ‌యం ద‌క్కించుకుంది. వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ గోల్డెన్ హ్యాండ్ గా పాపుల‌రైంది. ఇటీవ‌లే పుష్ప చిత్రంలో శ్రీ‌వ‌ల్లిగా అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింది. ఈ పాత్ర త‌న ద‌శ దిశ‌నే మార్చేసింద‌ని ర‌ష్మిక మంద‌న చెబుతోంది. నేష‌న‌ల్ క్ర‌ష్ గా వెలిగిపోతున్న ర‌ష్మిక‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన అవ‌కాశ‌మిద‌ని ఉబ్బిత‌బ్బిబ్బయ్యింది.

పుష్ప తన కెరీర్ ను ఎలా మార్చిందో రష్మిక మందన్న వెల్ల‌డించింది. ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా నటిగా నాపై ప్ర‌జ‌ల‌ అభిప్రాయాన్ని మార్చిందని అభిప్రాయ‌ప‌డింది. రష్మిక మందన్న తన తొలి హిందీ సినిమా గుడ్ బైకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఉంది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రముఖ నటి నీనా గుప్తాతో కలిసి రష్మిక ప్ర‌చారంతో బిజీగా ఉంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా పాపులర్ అయిన ర‌ష్మిక‌కు పాన్ ఇండియా కేట‌గిరీలో `పుష్ప:1` బిగ్ బ్రేక్ అని చెప్పాలి. అల్లు అర్జున్‌`తో కెరీర్ ప‌రంగా మ‌రో స్టెప్ ముందుకు వేసింది. వైరల్ ట్రాక్ ‘సామి సామి’తో ఊహించని విధంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో గొప్ప‌గా కీర్తినార్జించింది.

తాజా ప్రత్యేక ఇంటర్వ్యూలో రష్మిక తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయిన సినిమా గురించి మీడియా ప్ర‌శ్నించింది. త‌ను మాట్లాడుతూ, ``మొదట కిరిక్ పార్టీ... ఇది నా తొలి కన్నడ చిత్రం... తదుపరిది గీతా గోవిందం.. నటిగా నన్ను చాలా ఆకర్షించింది. పేరు తెచ్చింది. ఆ తర్వాత పుష్ప. ఇది దేశవ్యాప్తంగా నటిగా నాపై ఉన్న అభిప్రాయాన్ని మార్చింది`` అని తెలిపింది. నేను ఎప్పుడూ నటిని కాదు. నేను ఇంకా నన్ను నేను అన్వేషించుకునే దశలో ఉన్నాను. కాబట్టి నాకు పబ్లిక్ ఫిగర్ కావడం ఇప్పటికీ కొత్త కాన్సెప్ట్ అని కూడా అంది.

`పుష్ప: ది రైజ్` విజయం గురించి మరింత మాట్లాడుతూ- “మేము మంచి సినిమా చేశామని మాకు తెలుసు. సినిమా ఫలితాన్ని మనం ఎప్పటికీ ఊహించలేం. కంటెంట్ బాగుందని అది.. బయటకు వస్తుందని మాకు తెలుసు. ఫ‌లితం సానుకూలంగా ఉంటుందని భావంచాం. ఆపై ఫలితం `వావ్!` అనిపించింది.. అని ర‌ష్మిక అంది.

గుడ్ బాయ్- మిష‌న్ మ‌జ్ను విడుద‌ల‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. తొలిగా ఏక్తా ఆర్ కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మించిన గుడ్ బై 7 అక్టోబర్ 2022న ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ సినిమా. ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీతో ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.