Begin typing your search above and press return to search.
సోషల్ మీడియా ఉందిగా..ప్రెస్ మీట్ ఎందుకు?
By: Tupaki Desk | 23 Sep 2018 4:54 AM GMTతెలుగు ప్రేక్షకుల తాజా క్రేజ్..రష్మిక. గీతా గోవిందం సినిమాతో సరికొత్త మేడమ్ గా సుపరిచితమైన రష్మి తాజాగా నటించిన చిత్రం దేవదాసు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ సందర్భంగా ఆమెకో చిక్కు ప్రశ్న ఎదురైంది.
దీనికి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో తప్పులో కాలేశారు. నవ్వుతూ బదులిచ్చే క్రమంలో ఆమె నోటి నుంచి వచ్చిన మాటపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ రష్మికకు ఎదురైన ప్రశ్న ఏమిటి? ఆమె చేసిన తప్పు ఏమిటన్న విషయాల్లోకి వెళితే.. ఆ మధ్యన రష్మిక నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి అనుకుంటున్న వేళ.. గీతా గోవిందం రిలీజ్ తర్వాత ఎంగేజ్ మెంట్ రద్దు కావటం సంచలనమైంది.
దీనిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. ఇలాంటివేళ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఇదే అంశాన్ని ఒకరు అడిగారు. దీనికి నవ్వుతూ బదులిచ్చిన రష్మిక.. అమ్మాయిని ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టే అందరూ అడగాలనుకుంటున్నారా? అంటూ ఎదురుదాడి మొదలెడుతూ.. తానిప్పుడు శారీరకంగా.. మానసికంగా బలంగా ఉన్నానని.. ఇదే విషయాన్ని రెండు నెలల ముందు అడిగితే.. అయ్యో సార్.. అలాంటిదేమీ లేదండి అని చెప్పేదాన్ని అని.. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నానని చెప్పారు.
ఇప్పుడు తాను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడనని.. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే.. తన ఫ్యాన్స్ తో నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నా ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్ స్టోగ్రామ్ లో బోలెడంతమంది అభిమానులు తనను ఫాలో అవుతున్నారని.. కావాలంటే దాని ద్వారా చెబుతాను కానీ.. సినిమా ప్రమోషన్ లో ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు? అంటూ చిన్నసైజు క్లారిటీ క్లాస్ తీసుకున్నారు. మేం చెప్పేవి చెబుతాం. మీరు అవి రాసుకొని వెళ్లాలన్నట్లుగా అయితే ప్రెస్ మీట్ ఎందుకు? ఒక ప్రీరికార్డెడ్ వీడియో సీడీలను మీడియా వాళ్లకు ఇచ్చేస్తే మరింత బాగుంటుందిగా? అంటూ సినిమా జర్నలిస్టులు మండిపడుతున్నారు.
నో కామెంట్ అంటూ తేల్చేయాల్సిన ఇష్యూను.. మీకు చెప్పను.. చెబితే సోషల్ మీడియాలో చెబుతానన్న రష్మిక మాటలు సినీ జర్నలిస్టులను హర్ట్ అయ్యేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. ఒక్క హిట్ కే ఇలా మాట్లాడే రష్మిక బ్యూటీకి కానీ మరో నాలుగైదు హిట్లు పడితే.. ప్రెస్ మీట్ కూడా అక్కర్లేదని చెబుతుందేమో?