Begin typing your search above and press return to search.

ఇంత సిగ్గు వద్దనుకుంటున్న మేడమ్‌

By:  Tupaki Desk   |   10 Feb 2019 1:30 AM GMT
ఇంత సిగ్గు వద్దనుకుంటున్న మేడమ్‌
X
ఛలో' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న రెండవ సినిమా విజయ్‌ దేవరకొండతో 'గీత గోవిందం'గా చేసి ఒక్కసారిగా స్టార్‌ స్టేటస్‌ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌ లో వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. తెలుగు మరియు కన్నడంలోనే కాకుండా తమిళం నుండి కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. హీరోయిన్‌ గా ఇంత సక్సెస్‌ ఫుల్‌ కెరీర్‌ ను కొనసాగిస్తున్న రష్మిక - సినిమాల్లో మంచి నటనతో ఆకట్టుకునే రష్మికకు చిన్న సమస్య ఉందట. ఆ సమస్యను అదిగమించేందుకు చాలా ప్రయత్నిస్తున్నా కూడా అది పోవడం లేదట. అదే సిగ్గు.

అవును... రష్మికకు చాలా సిగ్గు అంటా - ఇన్ని సినిమాల్లో నటించిన తర్వాత కూడా ఇంకా కెమెరా ముందుకు వెళ్లాలంటే సిగ్గు - కెమెరా ముందు చాలా సిగ్గు పడి పోతూ టేక్‌ ల మీద టేక్‌ లు తింటూ ఉంటానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఏదైనా స్టేజ్‌ పైకి ఎక్కి మాట్లాడాలన్నా కూడా చాలా సిగ్గు అంది. ధైర్యం చేసి కొంత మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని - ఎక్కువ మాట్లాడలేనని చెప్పింది.

ఈ సిగ్గు అనేది త్వరగా పోతే బాగుండు - సిగ్గు పడుతూ ఉండటం వల్ల కొన్ని సార్లు ఇబ్బంది కూడా అవుతుందని, అవతలి వారు కూడా ఇబ్బంది ఫీల్‌ అవుతున్నారని రష్మిక చెప్పుకొచ్చింది. రష్మిక సిగ్గు పడుతూనే నటిస్తే ఇంత సక్సెస్‌ లు వస్తే, సిగ్గు లేకుండా నటిస్తే ఇంకా ఎంత సక్సెస్‌ లు వస్తాయో కదా అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. సిగ్గు మొహమాటం అనేది ప్రతి మనిషికి ఉండాల్సినవే. అవి అందరికి ఉన్నట్లుగానే మీకు ఉన్నాయి, దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని మరి కొందరు రష్మికకు సలహా ఇస్తున్నారు.