Begin typing your search above and press return to search.

నాగ్‌-నాని బ్రొమాన్స్‌ పై ర‌ష్మిక

By:  Tupaki Desk   |   23 Sep 2018 6:14 AM GMT
నాగ్‌-నాని బ్రొమాన్స్‌ పై ర‌ష్మిక
X
ఛ‌లో - గీత గోవిందం సక్సెస్‌ తో ర‌ష్మిక జోరు చూస్తుంటే టాలీవుడ్‌ ని త‌న గుప్పిట ప‌ట్టేసినంత‌ కాన్ఫిడెన్స్ క‌నిపిస్తోంది. యూత్ కూడా గీతా గీతా అంటూ క‌ల‌వ‌రించ‌డం ర‌ష్మిక రేంజును చెబుతోంది. తాజాగా ఈ భామ‌ న‌టించిన మూడో సినిమా `దేవ‌దాస్‌` ఈనెల 27న రిలీజ్‌కి వ‌స్తోంది. నాలుగురోజులే స‌మ‌యం ఉందింకా. ర‌ష్మిక‌ హ్యాట్రిక్ కొడుతుందా? కొడితే ఆ త‌ర్వాత ప‌రిస్థితేంటి? అంటూ అప్పుడే టాలీవుడ్ మీడియాలో ముచ్చ‌ట సాగుతోంది. నిన్న వైజ‌యంతి ఆఫీస్‌లో ర‌ష్మిక కాన్ఫిడెన్స్ పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

కింగ్ నాగార్జున‌తో కేవ‌లం రెండే రెండు రోజులు మాత్ర‌మే ప‌ని చేశాన‌ని చెప్పిన ర‌ష్మిక నానికి జోడీగా తెర‌పై క‌నిపించ‌నుంది. దాస్ పాత్ర‌లో నాని కెమిస్ట్రీ త‌న‌తో కంటే నాగార్జున‌తోనే అద్భుతంగా ఉంటుంద‌ని కితాబిచ్చింది. దేవా- దాస్ కాంబినేష‌న్ అదిరిపోతుంద‌ని చెప్పింది. లొకేష‌న్‌ లో ఏదైనా తెలియ‌క‌పోతే వెంట‌నే నాని ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయే దానిని అని చెప్పిన ఈ అమ్మ‌డు కింగ్ నాగార్జునను విప‌రీతంగా పొగిడేసింది. ఆయన ఆన్‌ లొకేష‌న్ ఉంటే అంతా ఫ‌న్నే. అస‌లు స‌మ‌య‌మే తెలీదు. ప్లెజెంట్‌ గా షూటింగ్ న‌డిచిపోయేది అంటూ క‌ళ్ల‌ను తిప్పేస్తూ చాలానే చెప్పింది ర‌ష్మిక‌.

కీర్తి సురేష్ - అనుప‌మ త‌ర్వాత మ‌ళ్లీ అంత వేవ్‌ తో దూసుకెళుతోంది ర‌ష్మిక‌. `ఛ‌లో` సినిమాకి ప‌రిమితంగానే పారితోషికం అందుకున్నా `గీత గోవిందం` స‌క్సెస్‌ తో ఇప్పుడు పారితోషికం ప‌రంగానూ పెద్ద రేంజుకు చేరుకుంద‌న్న మాటా వినిపిస్తోంది. అయితే `దేవ‌దాస్` కోసం ర‌ష్మిక ఎంత పారితోషికం తీసుకుంది.. అన్నది ఇప్ప‌టికి సస్పెన్స్. కీర్తి సురేష్ ఇప్ప‌టికే కోటి పైగానే పారితోషికం అందుకుంటోంది. అనుప‌మ‌ - రాశీ ఖ‌న్నా లాంటి నాయిక‌లు భారీగానే పారితోషికం అందుకుంటున్నారు. మ‌రి ర‌ష్మిక రేంజెంతో?