Begin typing your search above and press return to search.

గోరంతది కొండంత చేశారన్న గీత!

By:  Tupaki Desk   |   18 Sep 2018 5:58 AM GMT
గోరంతది కొండంత చేశారన్న గీత!
X
రష్మిక మందన్న ప్రస్తుతం ఒక చిత్రమైన పరిస్థితిలో ఉంది. ఒకవైపు వృత్తి రిత్యా సూపర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తుంటే మరో వైపు వ్యక్తిగత జీవితానికి సంబంధించి పుకార్లతో పాటుగా నెటిజనుల ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది. తప్పొప్పుల సంగతి ఏమోగానీ ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఎదుర్కోవడం కష్టమైన విషయమే.

రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిన తర్వాత రష్మిక పేరు మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. తప్పు రష్మికదే అన్నట్టుగా నెటిజనులు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా రక్షిత్ శెట్టి నిర్మాణంలో తెరకెక్కుతున్న 'వృత్ర' అనే కన్నడ సినిమానుండి తప్పుకోవడంతో ట్రోలింగ్ మరింతగా పెరిగింది. ఇక ఈ హంగామా గురించి రీసెంట్ గా రష్మిక ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది.

"మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. చాలా రోజుల నుండి నేను సైలెంట్ గా ఉన్నందుకు క్షమాపణ కోరుతున్నాను. నా గురించి చాలా స్టోరీలు.. ఆర్టికల్స్.. ట్రోల్స్.. కామెంట్స్ చూస్తున్నాను. నన్ను ఈ విధంగా ప్రాజెక్ట్ చేస్తూ.. గోరంతదాన్ని కొండంతలుగా చేస్తున్న వీటిని చూసి నాకు బాధ కలుగుతోంది.. అవి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. అలా అనే నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడం లేదు.. ఎందుకంటే మీరు అవి నమ్ముతున్నారు కాబట్టి. ఏ విషయాన్నో ఎవరినో సమర్థించుకోవడానికో నేను ఇక్కడకు రాలేదు. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే. నేనైనా - రక్షిత్ అయినా - ఇండస్ట్రీ లో మరొకరైనా ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.