Begin typing your search above and press return to search.
రష్మిక@4కోట్లు... నిర్మాతలు సమ్మె చేస్తే నాకేంటి?
By: Tupaki Desk | 6 Aug 2022 11:30 PM GMTఒక వైపు టాలీవుడ్ నిర్మాతలు సినిమాల బడ్జెట్ భారీగా పెరిగింది.. మేకింగ్ కు విపరీతంగా ఖర్చు పెరిగింది. కనుక నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు పారితోషికం తగ్గించుకోకుంటే సినిమాలు చేయడం కష్టంగా మారింది అంటూ ఏకంగా సమ్మె చేస్తున్నారు. ఆగస్టు 1 నుండి సాగుతున్న సమ్మె పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
ఒక వైపు నిర్మాతలు బాబోయ్ ఈ పారితోషికాలు మా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేస్తే మరో వైపు హీరోలు హీరోయిన్స్ తమ పారితోషికం ను సినిమా సినిమా కు పెంచుతూనే ఉన్నారు.
పుష్ప సినిమాకు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2 కు గాను తనకు 125 కోట్ల పారితోషికం కావాల్సిందే అంటూ బన్నీ డిమాండ్ చేశాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు రష్మిక మందన్నా ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికంను డిమాండ్ చేస్తుందట. హీరోయిన్ గా పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న రష్మిక మందన్నా ఆ సినిమా కు కాస్త అటు ఇటుగా కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకుందట. కాని పుష్ప 2 కు మాత్రం ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందట.
సినిమా మేకింగ్ ఖర్చు తగ్గించడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. మాకేంటి అన్నట్లుగా రష్మిక ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. రష్మిక మందన్నా కు నాలుగు కోట్ల పారితోషికం ఇవ్వొచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె అభిమానులు రష్మిక కు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ దక్కింది. అందుకే ఆమె కు భారీ ఎత్తున పారితోషికం ఇవ్వడం లో తప్పేం లేదు అంటున్నారు. పుష్ప 2 కి మాత్రమే కాకుండా కొత్తగా కమిట్ అవ్వబోతున్న అన్ని సినిమాలకు కూడా మూడు నుండి నాలుగు కోట్ల పారితోషికం ను డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. స్టార్ హీరోయిన్ గా రష్మికకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ పారితోషికం ఇవ్వాల్సిందే.. కానీ నిర్మాతల పరిస్థితి కూడా ఆలోచించాలి కదా అనేది కొందరి మాట.