Begin typing your search above and press return to search.

లంగావోణిలో ర‌ష్మిక ర‌ప్ఫాడించేసిందిగా!

By:  Tupaki Desk   |   26 Sep 2022 10:30 AM GMT
లంగావోణిలో ర‌ష్మిక ర‌ప్ఫాడించేసిందిగా!
X
హాట్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ కెరీర్ పై ఏ రేంజ్ లో ఫోక‌స్ పెట్టిందో చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన బ్యూటీ బాలీవుడ్ లోనే అదే త‌ర‌హాలో వెలిగిపోవాల‌ని త‌న‌దైన స్ర్టాట‌జీని అనుస‌రిస్తూ ముందుకెళ్తోంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాక‌ముందే ఉత్త‌రాది జ‌నాల్ని బుట్ట‌లో వేసుకుంటుంది. దొరికిన ఏ వేదికని విడిచిపెట్ట‌డం లేదు.

అవార్డులు..రివార్డుల ఫంక్ష‌న్ల‌లో ఎంతో చ‌లాకీగా పాల్గొంటుంది. బాలీవుడ్ అభిరుచుకి త‌గ్గ‌ట్టు డిజైన‌ర్ దుస్తుల్ల అందాలు ఆర‌బోస్తూ అగ్గిరాజేస్తుంది. స్కిన్ షో..క్లీవేజ్..థై షో అంటూ ర‌ష్మిక అందాల‌న్ని విచ్చ‌ల‌విడిగా ఆర‌బోసి క్ర‌ష్మిక అనిపిస్తుంది. ఇక‌ పుష్ప సినిమాతో వ‌చ్చిన క్రేజ్ ని తెలివిగా ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్తోంది.

ఆ సినిమాలో పాట‌ల‌కి ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ స్టెపులేసి అద‌ర‌గొట్టేస్తుంది. తాజాగా అమ్మ‌డు గుడ్ బై సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా జీటీవీలో ప్ర‌సార‌మ‌య్యే 'సూప‌ర్ మామ్స్' షోకి హాజ‌రైంది. ర‌ష్మిక స్టేజ్ పై ఎంట్రీతోనే అద‌రగొట్టింది. సామీ సామీ పాట‌కు స్టెపులేసి వేదిక‌ని ఒక్క‌సారిగా హీటెక్కించింది. ఆమెతో పాటు గోవిందా కూడా ఓ స్టెప్ అందుకుని మ‌రింత వ‌న్నే తీసుకొచ్చారు.

ఇది చూసిన ప్ర‌కేక్ష‌కులు ఫిదా అయ్యారు. హోస్ట్ లు సైతం కాలు క‌ద‌ప‌కుండా ఉండ‌లేక‌పోయారు. ఇక ర‌ష్మిక‌ బ్యూటీ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. లంగావోళిలో సెగలు పుట్టించింది. జాను వాను జుకై తాహే అంటూ చేతులు మెలితిప్పుతూ...మిరుమిట్లు గొలిపే లంగావోళీ దెబ్బ‌కి కుర్రాళ్లంతా అలా ప‌డి ఉండాల్సిందే. సొగ‌స‌రి త‌న‌దైన శైలి ఎక్స్ ప్రెష‌న్స్ తో ఆక‌ట్టుకుంది.

ఇద్ద‌రి హుక్ స్టెప్ హైలైట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ర‌ష్మిక అభిమానులు క్ర‌ష్మిక అంటూ క‌ల‌వ‌రించ‌డం మొద‌లు పెట్టారు. ఎవ‌రి స్టైల్లో వారు హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

బాలీవుడ్ డెబ్యూకి ముందే ర‌ష్మిక ఉత్త‌రాది జ‌నాల్ని తెలివిగా ఆక‌ట్టుకుంటుంద‌ని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో హిందీలో మూడు సినిమాలున్నాయి. ఇక తెలుగులోనూ అమ్మ‌డి క్రేజ్ కి తిరుగులేదు. ప్ర‌త్యేక‌మైన‌ అభిమానుల్ని సంపాదించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.