Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : నేషనల్ క్ర(ర)ష్మిక అన్నది ఊరకనే కాదు..!

By:  Tupaki Desk   |   21 Nov 2022 4:32 AM GMT
ఫోటో స్టోరీ : నేషనల్ క్ర(ర)ష్మిక అన్నది ఊరకనే కాదు..!
X
కన్నడ భామ రష్మిక తన మొదటి సినిమా కిరాక్ పార్టీ సినిమాతోనే ఆడియన్స్ లో ఒక ముద్ర వేసింది. ఇక ఆ క్రేజ్ తో తెలుగులో ఛలో మూవీ ఛాన్స్ అందుకుంది. అమ్మడి టాలెంట్ గుర్తించిన రష్మిక వరుస అవకాశాలు ఇస్తూ వచ్చింది. ముందు యువ హీరోలతో నే నటించి ఆ తర్వాత స్టార్స్ తో జోడీ కడుతుంది రష్మిక. కేవలం సౌత్ సినిమాలు చేస్తున్న టైం లోనే నేషనల్ క్రష్ గా మారింది రష్మిక. ఆడియన్స్ లో తన మీద ఏర్పడిన ఈ ఫోకస్ ని డైవర్ట్ కాకుండా చాలా ఫోకస్డ్ గా ఉంటుంది రష్మిక. ఈ క్రమంలో సినిమాలకు ఈక్వల్ గా తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు రెడ్ కలర్ డ్రెస్ లో అందాల ఛాలెంజ్ చేస్తుంది.

తనని చూస్తూ అలానే ఉండిపోవాలి అనిపించేలా చూపులతోనే పిచ్చెక్కించేస్తోంది రష్మిక. అమ్మడికి నేషనల్ క్రష్ అని ఊరకనే అనలేదు. రష్మిక చేస్తున్న ఈ హాట్ షో కుర్రాళ్లను తెగ డిస్టర్బ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా రెడ్ కలర్ డ్రెస్ లో రష్మిక ఫోటో షూట్ అదిరిపోయింది. తనకు వచ్చిన ఈ క్రేజ్ ని అన్ని విధాలుగా వాడుకుంటుంది రష్మిక.

సినిమాలకు ఈక్వల్ గా ఫోటో షూట్స్ చేస్తూ రష్మిక బీభత్సం సృష్టిస్తుంది. ఇన్ స్టాగ్రాం లో కథానాయికల ఫోటో షూట్స్ కి సెపరేట్ క్రేజ్ ఉంటుంది. నేషనల్ వైడ్ గా వారికి ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా వీరు షేర్ చేస్తున్న ఫోటోస్ ని ఫాలో అవుతుంటారు. అంతేకాదు ఆ ఫోటో షూట్స్ కి కామెంట్స్ చేస్తూ తమ అభిమానాన్ని చూపిస్తారు.

రష్మిక షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోస్ కి కూడా క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి. నువ్విలా రెచ్చిపోతే మాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి రష్మిక.. అసలు ఇంత అందం మెయింటైన్ చేయడం ఎలా కుదురుతుంది. లాంటి కామెంట్స్ తో పాటుగా రోజుకి వేల కొద్దీ లవ్ యు మెసేజ్ లతో అమ్మడి ఇన్ బాక్స్ మొత్తం ఫుల్ అయిపోతుంది.

ఇక రష్మిక చేస్తున్న సినిమాల విషయానికి వస్తే విజయ్ తో వారసుడు సినిమా చేస్తున్న రష్మిక పుష్ప 2 లో కూడా నటిస్తుంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను రిలీజ్ కు రెడీ అవుతుంది. మొత్తానికి నార్త్ సౌత్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లతో రష్మిక అదరగొట్టేస్తుంది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న రష్మిక చూస్తుంటే మరో పదేళ్లు తన హవా కొనసాగించేలా ఉంది.

రష్మిక ఫోటో షూట్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. లేటెస్ట్ రెడ్ హాట్ పిక్స్ కూడా అమ్మడి సత్తా చాటేలా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా రష్మిక మిగతా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.