Begin typing your search above and press return to search.

రష్మిక పిక్ టాక్ : చిన్న నిక్కరులో కేక

By:  Tupaki Desk   |   18 Jan 2023 1:30 PM GMT
రష్మిక పిక్ టాక్ : చిన్న నిక్కరులో కేక
X
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన. కర్ణాటకకు చెందిన రష్మిక మందన కన్నడలో కిరాక్‌ పార్టీ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాలో నటించే అవకాశం దక్కడంతో ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. ఆ తర్వాత ఆమె చేసిన వరుస సినిమాలతో సూపర్ హిట్‌లు అవడంతో... ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా చేస్తోంది.

అయితే బాలీవుడ్‌లో కూడా రష్మికకు వరుస అవకాశాలు లభిస్తూ ఉండడంతో మోస్ట్ హపెనింగ్ హీరోయిన్ అయిపోయింది. ఆ మధ్య నేషనల్ క్రష్‌ అంటూ ఒక మ్యాగజైన్ నిర్వహించిన ఓటింగ్‌లో మొదటి స్థానం దక్కించుకోవడంతో అప్పటినుంచి ఆమెను నేషనల్ క్రష్ అని పిలుస్తూ వస్తున్నారు.

ఆమె కున్న క్రేజ్‌తో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. అందుకే ఉదయం చెన్నైలో ఉంటే... మధ్యాహ్నం హైదరాబాద్... ఈవినింగ్ ముంబై అంటూ ఎప్పటికప్పుడు బిజీ బిజీగా గడిపేస్తోంది.

తాజాగా ఆమె విమానాశ్రయంలో ఫోటోగ్రాఫర్ల కంటికి చిక్కింది. ఒక సింపుల్ వైట్ షర్ట్ కింద... డెనిమ్ షాట్‌ వేసుకున్న రష్మిక మందన... ఒక బ్లాక్ కలర్ టోపీ ధరించి ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చింది. ఫోటోగ్రాఫర్లను చూడగానే కాసేపు ముచ్చటించి... వారితో సందడి చేస్తూ ఉంటుంది.

రష్మిక మందన దీంతో వారు కూడా ఆమె ఫోటోలు మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూ... ఉంటారు. రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపిన ఆమె ఏకంగా పెళ్లి పీటల వరకు వెళ్లి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

కానీ ఈ విషయం మీద ఇద్దరూ క్లారిటీ ఇచ్చిన పాపాన పోవడం లేదు. ఇద్దరూ కలిసే విదేశాలకు వెళుతున్నారు. ఒకరి సోషల్ మీడియా పోస్టుల్లో... మరొకరు కనికనిపించకుండా హింట్‌ ఇస్తున్నట్లు అనిపిస్తున్నారు. కానీ అందులో నిజా నిజాలు మాత్రం బయట పెట్టడం లేదు. త్వరలోనే బయట పెడతారేమో చూడాలి. ఇక రష్మిక తెలుగులో పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.