Begin typing your search above and press return to search.

అంధురాలి పాత్ర‌లో ర‌ష్మిక ప్రయోగం..!

By:  Tupaki Desk   |   17 Dec 2022 12:30 AM GMT
అంధురాలి పాత్ర‌లో ర‌ష్మిక ప్రయోగం..!
X
క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న న‌టించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబ‌ర్ చివ‌రిలో `పుష్ప` చిత్రం విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక న‌ట‌న‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది. ఇప్పుడు ఉత్త‌రాదినా ఈ భామ‌కు ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ ఏడాది వ‌రుసగా హిందీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ లో అమితాబ్ తో క‌లిసి న‌టించిన గుడ్ బై ఇటీవ‌లే విడుద‌లైంది. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. అయితే ప్ర‌స్తుతం `మిషన్ మజ్ను`లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టించింది. త్వ‌ర‌లో నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల కానున్న ఈ మూవీపైనే ర‌ష్మిక హోప్స్.

షేర్షా (2021) సూపర్ హిట్ కొట్టాక‌..అదే దేశ‌భ‌క్తి జోన‌ర్ లో తెర‌కెక్కిన `మిషన్ మజ్ను`లో మ‌ల్హోత్రా న‌ట‌న‌పైనా ర‌ష్మిక‌తో అత‌డి కాంబినేష‌న్ పైనా బ‌జ్ ఉంది. ఈ చిత్రంపై ఇటీవ‌ల టీజ‌ర్ లాంచ్ అనంత‌రం అంచనాలు పెరిగాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్. ఇండియా- పాకిస్తాన్ వార్ స‌మయంలో నిజ‌జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందింది. షేర్షా లాగా దేశభక్తి జాన‌ర్ లో తెర‌కెక్కింది. ఇక `షేర్షా` త‌ర‌హాలోనే `మిషన్ మజ్ను` కూడా థియేట్రికల్ విడుదల లేకుండా నేరుగా జనవరి 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంద‌ని చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సినిమాలో ర‌ష్మిక పాత్ర అభిమానుల‌ను స‌ర్ ప్రైజ్ చేయ‌నుంద‌నేది తాజా స‌మాచారం. తొలిసారిగా ర‌ష్మిక‌ అంధ యువ‌తి పాత్ర‌లో నటించింది. ఇది త‌న కెరీర్ లోనే చాలా ప్రత్యేకమైన పాత్ర. సిద్ధార్థ్ కి ప్రియురాలిగా క‌నిపిస్తుంది. ఇక అంధురాలి పాత్రలో అభిన‌యించేందుకు ర‌ష్మిక‌ విస్తృతంగా ప్రిపరేషన్ సాగించాల్సి వ‌చ్చింద‌ట‌. సెట్స్ పైకి రాకముందు దీనిపై చాలా పరిశోధన కూడా చేసింది. ఇక ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో రొమాంటిక్ యాంగిల్ చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని తెలిసింది. ఇది యూత్ ఆక‌ర్ష‌క మంత్రంగా ప‌ని చేస్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

మిషన్ మజ్ను టీజర్ తాజాగా విడుద‌లైంది. టీజ‌ర్ ఆద్యంతం గ‌గుర్పొడిచే సాహ‌స‌ విన్యాసాల‌తో ఆక‌ట్టుకుంది. ఇండియా-పాక్ వార్ నేప‌థ్యంలో `రా..` ఆప‌రేష‌న్ కి సంబంధించిన క‌థ‌లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా సాహ‌సోపేత‌మైన `రా- అధికారి`గా క‌నిపించ‌నున్నాడు. అత‌డి ప్రేయ‌సిగా ర‌ష్మిక క‌నిపించ‌నుంది. ఇందులో షరీబ్ హష్మీ కూడా నటించారు. శంతను బాగ్చి దర్శకత్వం వహించారు. పర్వీజ్ షేక్- సుమిత్ బతేజా- అసీమ్ అరోరా ఈ చిత్రానికి రచయితలు.

రష్మిక మందన్న కన్నడ రంగంలో తన కెరీర్ ను ప్రారంభించింది. కిరిక్ పార్టీ (2016) తొలి చిత్రం. ఛ‌లో- సుల్తాన్ (2021)- దేవ‌దాసు స‌హా ప‌లు తెలుగు సినిమాతో పాటు తమిళ సినిమాలోనూ తనదైన ముద్ర వేసింది. పుష్ప: ది రైజ్ (2021)తో హిందీ బెల్ట్ లోను ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. డ‌బ్బింగ్ వెర్షన్లు అన్ని భాష‌ల్లో విజ‌యం సాధించ‌డంతో ర‌ష్మిక పేరు కూడా మ‌ర్మోగింది. శ్రీ‌వ‌ల్లిగా త‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ముగ్ధులయ్యారు. నేష‌న‌ల్ క్ర‌ష్ గా గుర్తింపు త‌ర్వాత‌ ఈ సంవత్సరం ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్‌బై (2022)తో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఈ సంక్రాంతి త‌ర్వాత త‌న రెండో హిందీ చిత్రం మిష‌న్ మ‌జ్ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తదుపరి అల్లు అర్జున్ తో `పుష్ప 2- ది రూల్`పై దృష్టి సారించ‌నుంది. అలాగే రణబీర్ కపూర్ స‌ర‌స‌న `యానిమల్‌`లోను క‌థానాయిక‌గా న‌టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.