Begin typing your search above and press return to search.
ముద్దులు కాదు ముందు సినిమా చూడండి
By: Tupaki Desk | 20 March 2019 6:25 AM GMTఇటీవలే విడుదలైన డియర్ కామ్రేడ్ టీజర్ పెద్ద చర్చకే దారి తీస్తోంది. నిమిషం లోపే ఉన్న వీడియోలో అంతసేపు లిప్ లాక్ కిస్ చూపించడం పట్ల కామెంట్స్ ఘాటుగానే వచ్చాయి. ఇది కన్నడలో కూడా రిలీజ్ చేశారు కాబట్టి అక్కడే ఎక్కువ క్రిటిసిజం ఎదురుకోవాల్సి వచ్చింది. ట్రోల్లింగ్ కూడా ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఇది విజయ్ దేవరకొండకు పెద్ద విషయమేమీ కాదు కాని రష్మిక మందన్న మాత్రం ఫైనల్ గా స్పందించింది.
చిన్న టీజర్ చూసి ఇలా ఒక నిర్ణయానికి రావడం సరికాదని కథ డిమాండ్ చేయనిదే నేను ఏది చేయనని మేలో పూర్తి సినిమా చూశాక అప్పుడు చెప్పండి అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ ఒక్క మాట అందరిని సంతృప్తి పరిచేది కాదు కాని ఇక్కడో చిన్న లాజిక్ మిస్ అవుతోంది. నిజంగా కథ ప్రకారం పెదవులు పంచుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా అదేదో సర్ప్రైజ్ లాగా నేరుగా స్క్రీన్ మీద చూపిస్తే ఇంకా థ్రిల్ వచ్చేది. ప్రేక్షకులు కూడా ఆమోదించే వాళ్ళు.
అలా కాకుండా ప్రమోషన్ లో అతి కీలకంగా భావించే ఫస్ట్ టీజర్ సగం షాట్ ఇలా మూతి ముద్దుతోనే చూపించేస్తే ఎలా. అంటే ఇది ఉందని చెబుతూ యూత్ ని ఆకర్షించి మార్కెట్ డిమాండ్ ని పెంచుకోవాలనే ఉద్దేశమేగా. నెటిజెన్లు ఈ కోణంలోనే ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సబ్జెక్టు డిమాండ్ అన్నప్పుడు థియేటర్లో చూపించి అప్పుడు నేను కరెక్ట్ కదా అని చెప్పాల్సింది పోయి ఇప్పుడు టీజర్ లో ముద్దును చూడకండి నేరుగా సినిమా చూసాక అడగండి అంటూ చెప్పడం ఏమిటని అడుగుతున్నారు. ఇద్దరి వెర్షన్లు సబబుగానే అనిపిస్తున్నా ఎవరు కరెక్టో తేలడానికి మాత్రం మే 31 దాకా ఆగాల్సిందే