Begin typing your search above and press return to search.
అమ్మడి భయాల లిస్టు భారీగా ఉందిగా?
By: Tupaki Desk | 17 Nov 2019 5:01 AM GMTఇండస్ట్రీలో హీరోయిన్లు అవుదామని వచ్చే భామలెందరో ఉంటారు. కానీ.. అన్ని ఉన్నా సుడి లేక సరైన గుర్తింపు రాక ప్రయత్నాలు చేసి కనుమరుగైపోతుంటారు. ఇందుకు భిన్నంగా మరికొందరు ఉంటారు. వారిని వెతుక్కుంటూ వచ్చే పాత్రలతో అంతకంతకూ ఇమేజ్ ను పెంచుకోవటమే కాదు మస్తు డిమాండ్ ఉండే భామలు కొందరుంటారు. ఆ కోవలోకే వస్తారు రష్మికా మందాన.
అంత పెద్ద రౌడీ హీరో విజయ్ దేవరకొండను తన చూపులతో.. మాటలతో రీల్ లో చుక్కలు చూపించే రష్మిక రియల్ లైఫ్ కు వస్తే మస్తు భయాలతో ఉంటుందట. ఆ అమ్మడి భయాల జాబితాను విన్నంతనే.. ఇన్ని భయాలా? అని అవాక్కు కావటం ఖాయం.
తనకు బైక్ అంటే భయమని.. దాన్ని నడపటం అస్సలు ఇష్టం ఉండదని చెబుతోంది. హ్యాండిల్ మన చేతుల్లో ఉన్నా.. వేగానని అదుపులో ఉంచుకునే వీలున్నా.. ఏందుకో భయమని చెప్పింది. ఇక.. బైక్ వెనుక కూర్చోవటం అస్సలు ఇష్టముండదని చెప్పేసింది.
ఖాళీ రోడ్ల మీద బండి నడపాలంటే మహా భయంగా చెప్పుకొచ్చింది. ఇవే కాదు.. పది మంది ముందు మాట్లాడాలంటే భయమని.. తప్పులు చేస్తానేమోనన్న ఆందోళ ఉంటుందంది. తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా చేస్తానా? అన్న ఆందోళన కూడా ఉంటుందని చెప్పింది.
ఇన్ని భయాల మధ్య కెరీర్ ను అంత సక్సెస్ ఎలా చేసుకుంటుందన్న సందేహం కలుగక మానదు. అయితే.. తనలోని లోపాల మీద ఫుల్ క్లారిటీ ఉన్న ఆమె.. తనలోని బలహీనతల్ని అధిగమించేందుకు చేసే ప్రయత్నాలే ఆమెను సక్సెస్ తీరానికి తీసుకొస్తుంటాయట.
అదెలానంటే.. తనను భయపెట్టే అంశాల విషయంలో అలానే ఉంటే తాను సరిగా నటించలేనని ప్రేక్షకులు అస్సలు అనుకోకూడదన్న ఉద్దేశంతో మరింత జాగ్రత్తగా పని చేస్తుంటానని చెప్పింది. గెలవాలన్న తపనతో తన బలహీనతల్ని అధిగమిస్తానని చెప్పుకొచ్చింది. తన లోపాల్ని.. వాటిని అధిగమించే విషయంలో తాను ఫాలో అయ్యే అంశాల్ని రష్మిక చెప్పిన తీరు ఆసక్తిని కలిగించకమానదు.