Begin typing your search above and press return to search.

గీత మేడం ఎందుకు నో చెప్పిందో?

By:  Tupaki Desk   |   17 Oct 2019 2:30 PM GMT
గీత మేడం ఎందుకు నో చెప్పిందో?
X
ఛలోతో పరిచయమై గీత గోవిందంతో ఒక్క దెబ్బకు స్టార్ స్టేటస్ తెచ్చుకున్న రష్మిక మందన్న తక్కువ టైంలోనే మహేష్ బాబు సరసన సోలో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేయడం చిన్న విషయం కాదు. శాండల్ వుడ్ కు చెందిన రష్మికకు అక్కడకంటే ఇక్కడే ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే సబ్జెక్టు సెలక్షన్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దెబ్బలు తప్పడం లేదు. ఎన్నో ఆశలతో ఒప్పుకున్న దేవదాస్ - డియర్ కామ్రేడ్ లు ఆశించిన ఫలితాలు అందుకోకపోవడం ఈ బ్యూటీని నిరాశ పరిచిన మాట వాస్తవం.

తాజాగా సరిలేరు నీకెవ్వరూ-భీష్మలలో నటిస్తున్న రష్మిక మందన్న ఇటీవలే దిల్ రాజు త్వరలో తీయబోయే సినిమాకు నో చెప్పినట్టుగా వస్తున్న వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ మూవీ నిర్మాతల్లో ఆయన ఒకరన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య హీరోగా శశి దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా ప్లాన్ చేశారు. చైతు శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ పూర్తి కాగానే జనవరి నుంచి ఇందులో పాల్గొనేలా ప్లానింగ్ చేశారు.

తనకు జోడిగానే రష్మికను అడిగారట. కథ నచ్చలేదో తన పాత్రకు ప్రాధాన్యం తక్కువగా ఉందనుకుందో ఖచ్చితమైన కారణం తెలియదు కానీ మొత్తానికి ఆ ఆఫర్ కి మొహమాటం లేకుండా నో చెప్పినట్టు వినికిడి. డేట్స్ లేక చెప్పిందో లేక పెద్ద స్టార్లతోనే చేయాలని నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ రష్మిక తీసుకున్న డెసిషన్ ఎంత వరకు కరెక్ట్ అనేది ఆ సినిమా రిలీజయ్యాకే తెలుస్తుంది. వచ్చే వేసవికి విడుదల ప్లాన్ చేసిన ఈ మూవీకి వేరే హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడట దర్శకుడు