Begin typing your search above and press return to search.
ఇలాంటి టైంలో రష్మిక రిస్క్ చేస్తోందా..?
By: Tupaki Desk | 20 March 2020 5:41 AM GMT'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ రష్మికా మందన్న. తొలి చిత్రం ఇచ్చిన విజయంతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్', 'దేవదాస్', 'సరిలేరు నీకెవ్వరూ' వంటి భారీ చిత్రాలతో లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ దక్కించుకుంది. అందంతో పాటు అభినయం కూడా సొంతం చేసుకున్న ఈ భామ తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. రీసెంట్ గా విడుదలైన 'భీష్మ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ హోదాలో చేరిపోయింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి జరుగుద్దో ఎవరూ చెప్పలేరు. నేటితరం హీరోహీరోయిన్లు మరీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముద్దుగుమ్మ రష్మిక మందన్న తీసుకున్న ఓ నిర్ణయం సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తూ, వరుస విజయాలతో దూకుడు మీదున్న రష్మిక నిర్మాతగా మారబోతుందంట. కొత్త తరహా కథల కోసం చూస్తున్నానని, ఎవరి దగ్గరయినా మంచి కథలు ఉంటే తనకి మెయిల్ చేయమని ఒక ఈమెయిల్ ఐడీ కూడా ఇచ్చింది. తన దగ్గర చాలా చిన్న టీం ఉందని, కథలు చదివి రెస్పాండ్ అవడానికి సమయం పడుతుందని, అంతవరకు సంయమనంతో ఉండాలని కోరింది. రష్మిక తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వాగతించదగినదే అయినా కెరీర్ ఆరంభంలోనే ఇలా ఎందుకు చేయడం అని కొందరు సలహా ఇస్తుండగా, తెలుగులో హీరోయిన్లు నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ అని మరికొందరు జాగ్రత్తలు చెప్తున్నారు. నిజానికి మన సినీ ఇండస్ట్రీ లో నిర్మాతలు గా మారిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ వారిలో సక్సెస్ అయిన వాళ్ళకంటే చేతులు కాల్చుకున్న వారే ఎక్కువ. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. దీంతోపాటు రామ్ చరణ్ తదుపరి సినిమాలో రష్మిక నే హీరోయిన్ గా అనుకుంటున్నారంట. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని, కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న ఇలాంటి టైంలో రష్మిక తీసుకున్న నిర్ణయం పెద్ద సాహసమే అని చెప్పాలి.