Begin typing your search above and press return to search.

శ్రీవల్లి ఈ షార్ట్‌ ఏంటీ... మరీ పొట్టిగుందంటూ ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   24 Jan 2022 1:43 PM GMT
శ్రీవల్లి ఈ షార్ట్‌ ఏంటీ... మరీ పొట్టిగుందంటూ ట్రోల్స్‌
X
హీరోయిన్స్ పొట్టి డ్రస్ లు వేస్తే ప్రశంసించే వారు ఎంత మంది ఉంటారో అంతకు మించి ట్రోల్స్ చేసేందుకు సిద్దంగా ఉంటారు. అందంగా కనిపిస్తే పర్వాలేదు కాని మరీ వల్గర్ గా కనిపించవద్దు అనేది సోషల్‌ మీడియాలో చాలా మంది అభిప్రాయంగా ఉంటుంది. హీరోయిన్స్ అందాల ప్రదర్శణ చేసిన సమయంలో ఆస్వాదించే ఆ నెటిజన్స్ కొందరు హద్దులు దాటి స్కిన్‌ షో చేస్తే ట్రోల్‌ చేసి వాయించే వారు చాలా మంది ఉంటారు. కొందరు యాంకర్స్ మరియు హీరోయిన్స్ రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో వారి డ్రస్ ల వల్ల ట్రోల్స్ ను ఎదుర్కోవడం మరియు వారు ఆ ట్రోల్స్ కు కౌంటర్ ఇవ్వడం మనం రెగ్యులర్‌ గా చూస్తూనే ఉన్నాం. తాజాగా పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ అయిన రష్మిక మందన్నా తాను వేసుకున్న షార్ట్‌ వల్ల ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

సాదారణంగానే రష్మిక మందన్నా బయటకు వచ్చినప్పుడు కూడా కాస్త స్కిన్‌ షో చేస్తూనే ఉంటుంది. అలాంటిది తాజాగా ఆమె షార్ట్‌ మరీ పొట్టిగా వేసుకుంది. ఆమె వేసుకున్న షార్ట్‌ కనిపించి కనిపించనట్లుగా ఉంది. దాంతో ఆమెను కెమెరాల్లో బందించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ఆ వీడియో లు మరియు ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఆ ఫొటోలకు ఏంటీ శ్రీ వల్లి ఈ షార్ట్‌ మరీ ఇంత చిన్నగానా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంతోటి దానికి వేసుకోవడం ఎందుకు అంటూ కొందరు అంటే మరి కొందరు ఇంత కన్నా చిన్న షార్ట్‌ లు మీకు లభించలేదు అనుకుంటా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆమె డ్రస్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంది.

ఇప్పటికే పుష్ప సినిమా తో జాతీయ స్థాయిలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ అమ్మడు తాజాగా ఈ ఫొటోల వల్ల మరింతగా వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ లో రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తెలుగు లో పుష్ప తర్వాత మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఓ తమిళ సినిమాను కూడా ఈమె చేస్తుంది. సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉండి సౌత్‌ మరియు నార్త్‌ ల్లో బిజీ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు అప్పుడప్పుడు ఇలా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం కామన్ విషయం అయ్యింది. సెలబ్రెటీలు ఇలాంటి కాస్ట్యూమ్స్ లో కనిపించడం సోషల్‌ మీడియాలో చర్చ జరగడం.. రెండు మూడు రోజుల్లో అంతా నార్మల్‌ అవ్వడం సాదారణంగా జరుగుతున్న విషయం. కనుక రష్మిక ఈ షార్ట్‌ విషయం కూడా ఒకటి రెండు రోజుల పాటు హడావుడి కొనసాగి ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యే అవకాశం ఉంది.