Begin typing your search above and press return to search.
ప్లాప్ అయినా కామ్రెడ్ బాగా హెల్ప్ అయ్యాడే!
By: Tupaki Desk | 11 May 2021 12:30 AM GMTకన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఛలో మరియు గీత గోవిందం చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోనే కాకుండా ప్రస్తుతం రష్మిక తమిళం.. హిందీ మరియు కన్నడంలో కూడా సినిమాలు చేస్తోంది. హిందీలో రెండు ప్రతిష్టాత్మక సినిమాల్లో ఈమె నటిస్తోంది. అందులో ఒకటి 'మిషన్ మజ్ను'. ఈ సినిమా లో రష్మిక మందన్నాను ఎంపిక చేసిన కారణంను దర్శకుడు శాంతను క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆయన ఒక ఇంగ్లీష్ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మిషన్ మజ్ను గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.
మిషన్ మజ్ను సినిమా కోసం నటీ నటులను ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో హీరోయిన్ పాత్రకు రష్మిక అయితే బాగుంటుందని అనిపించింది. ఆమెను మొదటి సారి డియర్ కామ్రెడ్ హిందీ వర్షన్ లో చూసి దర్శకుడు నచ్చాడట. డియర్ కామ్రేడ్ సినిమా హిందీలో డబ్బ్ అయ్యి యూట్యూబ్ మరియు శాటిలైట్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలా బాలీవుడ్ లో రష్మిక మందన్నకు అవకాశం వచ్చింది. తెలుగులో డియర్ కామ్రేడ్ సినిమా తీవ్రంగా నిరాశ పర్చిన విషయం అందరికి తెల్సిందే.
ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న రష్మిక మందన్నా నానితో ఒక సినిమాలో ఇంకా పలువురు స్టార్స్ సినిమాలో నటించేందుకు కమిట్ మెంట్ ఇచ్చింది. అమితాబచ్చన్ తో ఒక సినిమాలో కూడా రష్మిక నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక తమిళంలో ఇటీవలే సుల్తాన్ తో పరిచయం అయ్యింది. అక్కడ కూడా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. మొత్తానికి రష్మిక నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.