Begin typing your search above and press return to search.

ర‌ష్మిక మంద‌న్న కి పైళ్ల‌న హీరో కూడా ప‌డిపోయాడు!

By:  Tupaki Desk   |   1 Aug 2022 5:30 AM GMT
ర‌ష్మిక మంద‌న్న కి పైళ్ల‌న హీరో కూడా ప‌డిపోయాడు!
X
ఇటీవ‌లే ర‌ష్మిక మంద‌న్న‌- విక్కీ కౌశల్ ఓ అండ‌ర్ వేర్ యాడ్ లో జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ యాడ్ లో ర‌ష్మిక‌ యోగా ఇనస్ర్ట‌క్ట‌ర్ గా న‌టించ‌గా.. ఆమె వ‌ద్ద విక్కీ యోగా నేర్చుకునే స్టూడెంట్ గా న‌టించాడు. ఇందులో విక్కీ రెండు చేతులు పైకి లైప‌డంతో..వాటితో పాటు అత‌ను వేసుకున్న ష‌ర్ట్ కూడా పైకి లేచి డ్రాయర్ బ్రాండ్ క‌నిపిస్తుంది.

అప్పుడా యోగా టీచ‌ర్ డ్రాయ‌ర్ చూస్తూ నెంబ‌ర్లు కౌంట్ చేస్తుంది..వాటితో పాటు కొల‌త‌లు కూడా. దీంతో ర‌ష్మిక పెర్పార్మెన్స్ పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్ మామూలుగా జ‌ర‌గ‌లేదు. సిగ్గు లేకుండా మ‌గాడి డ్రాయ‌ర్ చూసి నెంబ‌ర్లు కౌంట్ చేయ‌డం ఏంటి? ఇలాంటి చీఫ్ యాడ్స్ ఎలా చేస్తారంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

వీటిని ఆ డ్రాయ‌ర్ బ్యాచ్ ప‌ట్టించుకోలేదుగానీ... తాజాగా ఆయాడ్ లో ర‌ష్మిక మంద‌న్న పెర్పార్మెన్స్ కి విక్కీ ఫిదా అయిపోయాడు. `రష్మిక మంద‌న్న‌తో క్యూట్ గా న‌టించింది. ఆమెతో పాటు నేను కూడా క్యూట్ గా ప‌ని చేయ‌డం ఎంతో బాగుందంటూ చెప్ప‌కొచ్చాడు. ఆ ర‌కంగా పెళ్లైన హీరో ర‌ష్మిక మంద‌న్న‌ని పొగిడేయం ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌కొచ్చింది.

నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక‌ని అభిమానులంతా క్యూట్ గాళ్ల్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఆ పిలుపు వాళ్లకే సొంతం. కానీ ఇప్పుడా బాలీవుడ్ హీరో కూడా ర‌ష్మిక‌ని క్యూటీ అనేయ‌డం? పై కొంత మంది మ‌న‌సులు నొచ్చుకుంటున్నాయి. పెళ్లి కానీ హీరో ఇలా పొగిడిన ప‌ర్వాలేదు. కానీ పెళ్లైన హీరో క్యూటీ..నాటీ అన‌డం ఏంటో అంటూ సైట‌ర్లు సైతం నెట్టింట ప‌డుతున్నాయి.

ఇదంతా నెట్టింట జ‌రుగుతోన్న స‌ర‌దా సంభాష‌ణ అన్న‌ది గ్ర‌హించాల్సిన విష‌యం. ఇటీవ‌లే రౌడీస్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక‌పై త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ర‌ష్మిక అంటే ఎంత ఇష్ట‌మో ఇన్నాళ్లు దాచిపెట్టినా చివ‌రికి ఓపెన్ కాకుండా ఉండ‌లేక‌పోయాడు. ఇక ర‌ష్మిక ఇప్ప‌టికే క‌న్న‌డ న‌టుడు ర‌క్షిత్ శెట్టితో ప్రేమాయ‌ణం న‌డిపి నిశ్చితార్ధం జ‌రిగిన అనంత‌రం విడిపోయిన సంగ‌తి తెలిసిందే.