Begin typing your search above and press return to search.
బుట్ట బొమ్మతో రష్మిక క్యాట్ ఫైట్ దేనికి?
By: Tupaki Desk | 1 Feb 2020 1:30 AM GMTసంక్రాంతి భామలు.. పూజా హెగ్దే- రష్మిక మందన మధ్య స్మార్ట్ వార్ కి తెర లేచిందా? అంటే అవుననే సమాచారం. ఒకదాని వెంట ఒకటిగా ప్రాజెక్టులకు సంతకాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామల నడుమ పారితోషికం పరంగా పోరు మొదలైందట. సంక్రాంతి భామలుగా సక్సెస్ స్పీడ్ మీద ఉన్నారు. అల వైకుంఠపురములో చిత్రంతో పూజా హెగ్దే... సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రష్మిక మందన క్రేజు పెరిగింది. ప్రస్తుతం ఇద్దరూ ఫుల్ బిజీ. రష్మిక.. నితిన్ సరసన భీష్మలో నటిస్తోంది. ఫిబ్రవరిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అటుపైనా.. బన్నీ సరసన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంతో రష్మిక బిజీగా ఉంది. దీంతో పాటు పనిలో పనిగా కొత్త సినిమాల స్రిప్ట్ లు వింటోంది. దాదాపు ఈ ఏడాదంతా అమ్మడు ఫుల్ బిజీ అని తెలుస్తోంది.
అటు పూజాహెగ్దే ప్రభాస్ సరసన జాన్ చిత్రంలో నటిస్తోంది. ఈసినిమా పూర్తయిన వెంటనే మళ్లీ తారక్ తో జత కట్టనుంది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని తారక్ లాక్ చేసాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత భారీ సక్సెస్ అవ్వడంతోనే గురూజీ పూజాని సెంటిమెంట్ గా బరిలో దింపుతున్నాడు. పూజ కొత్త కమిట్ మెంట్లు జోరు బాగానే ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే పూజ-రష్మిక మధ్య రెమ్యునరేషన్ వార్ మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహర్షి సినిమాకు పూజా హెగ్దే 2 కోట్లు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో బుట్టబొమ్మపై కాస్త నెగిటివిటి మొదలైంది. సరైన సక్సెస్ లేకుండా రెండు కోట్లు ఛార్జ్ చేస్తుందా? అని విమర్శలొచ్చాయి. దీంతో పూజా అప్పటి నుంచి అరకోటి తగ్గించి కొటిన్నర ఫిక్స్ అయ్యిందట. బన్నీ సినిమాకు అంతే ఛార్జ్ చేసిందిట.
ఇక రష్మిక సరిలేరు చిత్రానికి కోటిన్నర అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా పూజ కంటే చాలా వెనకొచ్చిన రష్మిక సో బెటర్ అంటూ కథనాలు మొదలయ్యాయి. దీంతో పూజా కూడా సీన్ లోకి ఎంటరై....అంతకు ముందు 2 కోట్లు తీసుకున్న సంగతి మర్చిపోయిందా? అంటూ ఆధిపత్య పోరుకు రెడీ అవుతోందట. ఒకరిపై ఒకరు లో లోపల ఈ తరహా క్యాట్ ఫైట్ వేడెక్కిస్తోందట.