Begin typing your search above and press return to search.
ఛలో బ్యూటీకి మరో హిట్టు పడింది
By: Tupaki Desk | 2 March 2019 4:09 AM GMTటాలీవుడ్ లో అడుగు పెట్టిన తొలి ఏడాదే ఛలో లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు ఇండస్ట్రీ హిట్ గీత గోవిందంని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్నకు మధ్యలో దేవదాస్ చిన్న ఝలక్ ఇచ్చినా అదేమంత ప్రభావం చూపలేకపోయింది. అటు కన్నడ ఇటు తెలుగు రెండు భాషల్లోనూ యమా బిజీగా ఉన్న రష్మిక మందన్న కొత్త కన్నడ సినిమా యజమాన ఇవాళ విడుదలైంది. శాండల్ వుడ్ లో కెజిఎఫ్ తర్వాత అంత భారీ స్థాయిలో హైప్ ప్లస్ విడుదల దక్కించుకున్న యజమాన పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో రూపొందిన మూవీనే అయినప్పటికీ మాస్ కి నచ్చే గూస్ బంప్స్ ఎపిసోడ్స్ పుష్కలంగా ఉండటంతో వసూళ్ల పరంగా రికార్డులు ఖాయమని చెబుతున్నారు. స్టార్ హీరో దర్శన్ మూవీ కావడంతో సౌత్ లో భారీ ఎత్తున విడుదల చేసారు. హైదరాబాద్ లో సైతం రెండు మూడు షోల చొప్పున ఐదారు స్క్రీన్లు ఇచ్చారు. అంతే కాదు అనంతపురం లాంటి జిల్లా కేంద్రాల్లో ఆదోని లాంటి చిన్న తరహా పట్టణాల్లో స్ట్రెయిట్ రిలీజ్ చేయటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఇలా కన్నడ సినిమాలు నేరుగా విడుదల చేయడం దశాబ్దాల క్రితమే ఆగిపోయింది.
కెజిఎఫ్ ఇచ్చిన ఉత్సాహంతో మెల్లగా దారులు విస్తృతమవుతున్నాయి. ఇక యజమాన విషయానికి వస్తే ఏళ్ల తరబడి సంప్రదాయ నూనె ఉత్పత్తిని నమ్ముకున్న ఓ ఊరికి రక్షణగా ఉంటాడు హీరో. కార్పొరేట్ సంస్థల కన్ను దీని మీద పడుతుంది. వాటి రాకాసి కోరల నుంచి ఊరిని ఎలా కాపాడుకుంటాడో అదే యజమాన. ఇదే టైటిల్ తో చాలా ఏళ్ళ క్రితం విష్ణు వర్ధన్ హీరోగా నటించిన చిత్రం చరిత్ర సృష్టించింది. అదే మా అన్నయ్యగా తెలుగులో రాజశేఖర్ తో రీమేక్ చేశారు. మరి ఈ మాడరన్ యజమానని మన యూత్ హీరోలు ఎవరైనా టచ్ చేస్తారేమో చూడాలి.