Begin typing your search above and press return to search.
రష్మిక అతి కారణంగా చేజారిన మరో సినిమా?
By: Tupaki Desk | 21 Oct 2019 10:41 AM GMT'గీత గోవిందం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న ప్రస్తుతం మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో పాటు ఇంకా పలు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. తెలుగు.. తమిళం చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు తనకు వచ్చిన క్రేజ్ తో పారితోషికంను అమాంతం పెంచేసింది. రష్మిక పారితోషికం చూసి దిల్ రాజు అవాక్కయ్యాడట. నాగచైతన్య హీరోగా శిశి అనే కొత్త దర్శకుడితో దిల్ రాజు చేయాలనుకున్న సినిమాకు రష్మికను అనుకున్నారట. రెండు సార్లు ఆమెకు కథను కూడా దర్శకుడు శశి చెప్పాడట. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో రష్మికను పారితోషికం విషయంలో దిల్ రాజు పక్కకు పెట్టేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంతకు ముందు 'జెర్సీ' హిందీ రీమేక్ ఆఫర్ ను కూడా పారితోషికం కారణంగానే రష్మిక వదిలేసిందని పుకార్లు వచ్చాయి. నాని హీరోగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న జెర్సీ చిత్రంను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నాడు. హిందీలో షాహిద్ కపూర్ కు జోడీగా రష్మికను సంప్రదించగా ఈ అమ్మడు భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. దాంతో నిర్మాతలు రష్మిక ను లైట్ తీసుకున్నారని తెలుస్తోంది.
ఇలా వచ్చిన పెద్ద ఆఫర్లను పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసి వదిలేసుకోవడం వల్ల ఆ తర్వాత బాధపడాల్సి వస్తుందని రష్మికకు సినీ వర్గాల వారు సూచిస్తున్నారు. మెల్ల మెల్లగా వచ్చే అవకాశాలు కూడా రావని.. ఆమె రెమ్యూనరేషన్ ను భరించడం మనవల్ల కాదని ఆ తర్వాత కూడా నిర్మాతలు ఆమెను కనీసం సంప్రదించేందుకు కూడా ఆసక్తి చూపక పోవడం వంటివి జరిగే అవకాశం ఉందని.. రష్మిక కాస్త తగ్గి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మరికొన్ని సినిమాలను ఇలాగే పారితోషికం విషయంలో వదిలేస్తే ఆమె కెరీర్ కష్టాల్లో పడటం ఖాయమంటూ విశ్లేషకులు అంటున్నారు.