Begin typing your search above and press return to search.
ట్రోల్ చేసిన నెటిజన్ పై రష్మిక పర్ఫెక్ట్ పంచ్
By: Tupaki Desk | 16 Dec 2021 4:30 AM GMTసోషల్ మీడియా ప్రభావంతో వరల్డ్ కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఎవరు ఏం స్పందించినా.. ఏం జరిగినా టక్కున తెలిసిపోతోంది. ఇక దీని ప్రభావం సినీ తారలపై బాగానే పడుతోంది. సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు ఆడియన్స్ కి మధ్య దూరం తగ్గిపోయింది.
సెలబ్రిటీలు కూడా తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుండటంతో ఇద్దరి మధ్య దూరం తగ్గి నేరుగా కామెంట్ లు .. రిప్లైలు చేసుకునే సంస్కృతి మొదలైంది.
అదే ఇప్పుడు సెలబ్రిటీలకు శాపంగా మారుతోంది. చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. స్టార్లు ఏ చిన్న పొరపాటు చేసి దొరికిపోయినా నెటిజన్ లు సోషల్ మీడియాలోనే వారిని టార్గెట్ చేస్తూ ఏకిపారేస్తున్నారు. ఇబ్బందికరమైన భాషలో ట్రోల్ చేస్తూ స్టార్స్ ని మరీ ముఖ్యంగా హీరోయిన్ లని ఏడిపించేస్తున్నారు.
తాజాగా నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయి ట్రోలింగ్ కు గురైంది రష్మిక మందన్న. ఇటీవల నేషనల్ క్రష్ గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న రష్మిక `పుష్ప` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో రష్మికని ఓ నెటిజన్ దారుణంగా ట్రోల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో రష్మిక `పుష్ప` ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ వివిధ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ఈ సందర్భంగా రష్మిక మీడియాతో ముచ్చటించిన విషయాల్ని పరిశీలించిన ఓ నెటిజన్ `దీన్ని అసలు హీరోయిన్ గా తీసుకోకుండా ఉండాల్సిందని, ఇది..దీని ఓవర్ యాక్టింగ్ ` అంటూ కామెంట్ లు చేశాడు. అయితే ఈ కామెంట్ లకు రష్మిక పర్ఫెక్ట్ పంచ్ వేసింది.
`యాక్టింగో.. ఓవర్ యాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను. నువ్వేం సాధించావు నాన్నా` అని పర్ఫెక్ట్ పంచ్ వేసింది. ఇప్పుడిది నెట్టింట వైరల్ గా మారింది.