Begin typing your search above and press return to search.
రష్మిక బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది
By: Tupaki Desk | 5 April 2022 10:30 AM GMTసున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించడంలో యువ దర్శకుడు హను రాఘవపూడిది ప్రత్యేక శైలి. 'పడి పడి లేచే మనసు' చిత్రం తరువాత ఆయన ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే క్యాన్షన్ తో ఈ చిత్రాన్ని హను రాఘవపూడి రూపొందిస్తున్నారు.
ఇందులో దుల్కర్ సల్మాన్ కు జోడీగా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సీత పాత్రలో ఓ హీరోయిన్ గా నటిస్తుందని ఇదివరకే ప్రకటించిన చిత్ర బృందం తాజాగా మంగళవారం మెయిన్ హీరోయిన్ ని పరిచయం చేశారు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు అఫ్రీన్. మంగళవారం రష్మిక పుట్టిన రోజు కావడంతో మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ వీడియో ని విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఈ గ్లింప్స్ వీడియోలో ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల మధ్య కార్లు తగలబడుతుంటే తలకు రెడ్ కలర్ హిజాబ్ తో ప్యాంట్ , షర్ట్ ధరించి మొడలో హ్యాండ్ బ్యాగ్ తో సీరియస్ లుక్ లో రష్మిక కశ్మీరీ యువతిగా కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఓ రెబెల్ యువతి గా ఈ చిత్రంలో రష్మిక కనిపించబోతోంది. అయితే ఇందులో ఆమె పాత్ర రెగ్యులర్ పాత్రలకు పూర్తి భిన్నంగా హీరోయిక్ గా వుంటుందని మేకర్స్ చెబుతున్నారు. 'లెఫ్టినెంట్ రామ్' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా కనిపించబోతున్నారు.
మృనాల్ ఠాకూర్ ఎంట్రీతో సినిమాపై బజ్ ఏర్పడింది. తాజాగా రష్మిక మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండటం, ఆమెకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఇంట్రెస్టింగ్ గా వుండటంతో ఈ సినిమా పై క్రేజ్ మరింత పెరిగింది. ఆ క్రేజ్ కి తగ్గట్టే ఎవరూ ఊహించని కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. 1964 పీరియడ్ లో ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ అల్లర్లకి లెఫ్టినెంట్ రామ్ కున్న సంబంధం ఏంటన్నదే ఈ సినిమా.
దుల్కర్ సల్మాన్ మిలటరీ ఆఫీసర్ గా నటిస్తున్ంన ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించబోతోంది.
సరికొత్త నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పీఎస్ వినోద్, సంగీతం విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు, ఆర్ట్ వైష్ణవీ రెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్ శర్మ.