Begin typing your search above and press return to search.
రష్మిక రెమ్యునరేషన్ రూ.2 కోట్లు..! ఇంకా కావాలంటున్న హీరోయిన్!
By: Tupaki Desk | 12 Feb 2021 1:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా జోరు చూపిస్తోంది హీరోయిన్ రష్మిక మందన్న. పరిస్థితి ఎలా తయారైందంటే.. పెద్ద హీరోలకు సంబంధించి ఏ కొత్త సినిమా అనౌన్స్ అయినా.. ఫస్ట్ ఆప్షన్ రష్మికే అన్నట్టుగా ఉంది. ఆమె డేట్స్ కుదరకుంటే.. అప్పుడు వేరే హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నారట! ఇంకేముందీ..? దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి కదా? ఇప్పుడు ఆ పనిలోనే ఉందీ కన్నడ అందం.
ఇటీవల ఆమె ఒక సినిమా కోసం రూ .1.5 కోట్ల పారితోషికం తీసుకుందని సమాచారం. అయితే.. ఇప్పుడు ఆ మొత్తం రౌండ్ ఫిగర్ అయ్యిందని టాక్ నడుస్తోంది. రాబోయే ఓ చిత్రానికి రష్మిక అక్షరాలా 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తనదాకా వెళ్లడంతో స్పందించిందీ ముద్దు గుమ్మ.
తాను విన్న ఈ అమౌంట్ వీలైనంత త్వరగా నిజమైతే ఎంత బాగుంటుంది కదా అంటోంది రష్మిక. ''నేను ఒక చిత్రానికి 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నానని ప్రచారం సాగుతోంది. నిజానికి ఆ ఫిగర్ నా మనసులో ఉంది. అది త్వరగా నిజం కావాలని కోరుకుంటున్నాను. అంతేకాదు.. రెమ్యునరేషన్ విషయంలో గాసిప్స్ ఇంకా హై రేంజ్ చేరాలని ఆశిస్తున్నాను.'' అని తన మనసులోని మాటను బయట పెట్టింది రష్మిక.
కాగా.. ప్రస్తుతం కొత్త కథలు వినట్లేదట రష్మిక. తనతో ముందుగా ఓకే చెప్పించుకుంటున్న మేకర్స్.. సినిమాను ఆలస్యంగా స్టార్ట్ చేస్తున్నారట. అందవల్ల తాను ప్రస్తుతం కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాలకు ఓకే చెప్తానంటోంది రష్మిక.ఇదిలాఉండగా.. తన డ్రీమ్ రోల్స్ గురించి కూడా బయటపెట్టిందీ బ్యూటీ. సౌందర్య, శ్రీదేవి బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశాన్ని వదులుకోనని చెప్తోంది రష్మిక.