Begin typing your search above and press return to search.

హై రెమ్యునరేషన్ పై స్పందించిన రష్మిక..'వాళ్లిస్తానంటే.. నేనొద్దంటానా..?'

By:  Tupaki Desk   |   20 Feb 2021 5:30 PM GMT
హై రెమ్యునరేషన్ పై స్పందించిన రష్మిక..వాళ్లిస్తానంటే.. నేనొద్దంటానా..?
X
ఇప్పుడు టాలీవుడ్ లో జోరు చూపిస్తున్న హీరోయిన్ ఎవ‌రు అంటే మొద‌ట‌గా వినిపించే పేరు ర‌ష్మిక మంద‌న్న‌! టాప్ స్టార్స్‌, ఫిల్మ్ మేక‌ర్స్ ఏ ప్రాజెక్టు అనుకుంటున్నా.. ర‌ష్మిక క్యాలెండ‌ర్ ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. దీంతో.. ఈ అమ్మ‌డి ఫేమ్ రాకెట‌లా దూసుకుపోతోంది. దాంతోపాటు రెమ్యున‌రేష‌న్ కూడా అంత‌కంతకూ పెంచుకుంటూ పోతోంది.

తెలుగు ఇండ‌స్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది ర‌ష్మిక‌. ‘కిరాక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. షార్ట్ పీరియడ్ లోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్య ఛలో చిత్రంలో హీరోయిన్ గా మొదటి మూవీ చేసిన రష్మిక.. విజయ్‌దేవరకొండ ‘గీతగోవిందం’తో ఎక్కడికో వెళ్లిపోయింది.

వరుస సక్సెస్‌లతో స్టార్‌ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తూ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. తెలుగు, కన్నడ చిత్రాలతో టాప్ రేంజ్ కు వెళ్లిన రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించింది. అయితే.. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ చిత్రం కోసం ఈ బ్యూటీ ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకుందన్నది ఆ వార్త సారాంశం!

కాగా.. ఈ వార్తలపై లేటెస్ట్ గా స్పందించింది రష్మిక. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను భారీగా పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవి నిజమైతే చాలా బాగుంటుంది’ అని అన్నారు. అంతేకాకుండా తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు. ‘ప్రచారంలో ఉన్నంత రెమ్యునరేషన్‌ తీసుకోవాలనేదే నా కల’ అన్నది రష్మిక.

ప్రస్తుతం రష్మిక తెలుగు‌లో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప‌’, శ‌ర్వానంద్‌తో కలిసి ‘ఆడాళ్లు మీకు జోహార్లు ’ అనే సినిమాల్లో నటిస్తోంది. వీటితోపాటు మరో రెండు హిందీ సినిమాల్లోకూడా నటిస్తోంది. అయితే.. ఇటీవల ఆమె ఒక సినిమా కోసం రూ .1.5 కోట్ల పారితోషికం తీసుకుందని స‌మాచారం. దీంతో.. త్వరగా రెండు కోట్లకు టెండర్ పెట్టాలని చూస్తోంది. మరి, ఈ ముద్దు గుమ్మ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.