Begin typing your search above and press return to search.
నిశ్చితార్థం రద్దు చేసుకున్నది అందుకేనట!
By: Tupaki Desk | 26 Dec 2019 11:12 AM GMTఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. సంక్రాంతికి రిలీజ్ కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇవి కాకుండా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మరో సినిమాలో కూడా రష్మిక హీరోయిన్. వృత్తిపరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న రష్మిక వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం సింగిల్ గా ఉంటోంది.
గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది రద్దు చేసుకున్నారు. ఈమధ్య ఒక ఇంటర్వ్యలో రక్షిత్ ను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తే 'కొన్ని విషయాలను మర్చిపోవడమే మంచిది' అని స్పందించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మికకు ఇలాంటి ప్రశ్నే ఎదురయింది. దీనికి సమాధానం ఇస్తూ మొదట్లో ఇద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడ్డామని అందుకే వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నామని తెలిపింది. అయితే ఇద్దరికి సినిమాలో రాణించాలనే కోరిక ఉందని.. అందుకే పెళ్లిని రెండేళ్లు వాయిదా వేసుకున్నామని తెలిపింది. అయితే అప్పటికి అవకాశాలు ఎక్కువ అయ్యాయని.. ఆ సమయంలో పెళ్లి చేసుకుంటే సినిమాలకు న్యాయం చేయలేనని.. నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్టు ఆవుతుందనే ఆలోచనతో పెళ్లి రద్దు చేసుకున్నట్టు వెల్లడించింది.
కారణాలు ఏమైనప్పటికీ రష్మిక మాత్రం తన కెరీర్లో బిజీగా మారింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. రష్మిక ఈ నిర్ణయం తీసుకోవడంపై పెద్దగా ఫీలైనట్లు కనిపించడం లేదని కానీ రక్షిత్ శెట్టి మాత్రం బాగానే హర్ట్ అయినట్టున్నాడు. అందుకే ఆ విషయంపై ఎవరు ప్రశ్నించినా సమాధానం దాటేస్తున్నాడు.