Begin typing your search above and press return to search.

మెక్ డొనాల్డ్స్ నుంచి ర‌ష్మిక స్పెష‌ల్స్

By:  Tupaki Desk   |   21 Nov 2021 6:06 AM GMT
మెక్ డొనాల్డ్స్ నుంచి ర‌ష్మిక స్పెష‌ల్స్
X
బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌ ర‌ష్మిక మంద‌న బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు-హిందీలో భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు వ‌రుస వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో బిజీగా ఉంది. ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ కు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. స‌ద‌రు కంపెనీ రూపొందించిన‌ అనేక ప్రకటనలలో రష్మిక‌ కనిపించింది.

ఇప్పుడు ఈ బ్యూటీ పేరుతో ఆ సంస్థ మీల్ ని ప్ర‌క‌టించింది. గత రాత్రి రష్మిక మెక్ డొనాల్డ్స్ మెనూలో భాగమైన `ది రష్మిక మీల్`ని ప్రకటించింది. ఈ భోజనానికి సంబంధించిన ప్రోమో వీడియోను కూడా రష్మిక షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది. వీడియోను పరిశీలిస్తే.. రష్మిక భోజనంలో స్పైసీ ఫ్రైడ్ చికెన్ .. పెరి-పెరి ఫ్రైస్ ఇన్ ఎ మెక్ స్పైసీ చికెన్ బర్గర్.. నింబు ఫిజ్ .. మెక్ ఫ్లరీ ఉంటాయి. డ్రమ్ రోల్స్ .. #ది ర‌ష్మిక మీల్ ని పరిచయం చేస్తున్నాం.. అంటూ వివ‌రాల్ని వెల్ల‌డించింది.

రష్మిక మీల్ ఇప్పుడు భారతదేశంలోని అన్ని మెక్ డొనాల్డ్స్ స్టోర్ లలో అందుబాటులో ఉంది. కెరీర్ విష‌యానికి వ‌స్తే.. రష్మిక తదుపరి సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో కనిపించనుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన `పుష్ప` డిసెంబర్ 17న తెలుగు- హిందీ- కన్నడ- తమిళం- మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. కిషోర్ తిరుమ‌ల‌ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్నారు.

వ‌రుస‌గా రెండు బాలీవుడ్ రిలీజ్ లు

ర‌ష్మిక మంద‌న్న కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్.. బాలీవుడ్ లో వ‌రుస‌ సినిమాలు చేస్తోంది. హిందీలో మిష‌న్ మ‌జ్ను.. గుడ్ బై చిత్రాల్లో న‌టిస్తోంది. కాగా ఈ రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవ్వ‌డానికి రెడీ అవుతున్నాయి.

మిష‌న్ మ‌జ్నులో సిద్దార్థ్ మ‌ల్హోత్రాకి జంట‌గా న‌టిస్తోంది. ర‌ష్మిక‌కి బాలీవుడ్ లో తొలి చిత్ర‌మిది. శాంత‌ను బాగ్చీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. దీంతో ర‌ష్మిక స‌క్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉంది. స‌మ్మ‌ర్ కానుక‌గా మే 13న రిలీజ్ అవుతోంది.

మ‌రో వైపు బాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలోనే లెజెండ‌రీ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ తో తెర‌పై పంచుకునే అవ‌కాశం రెండ‌వ సినిమా `గుడ్ బై` తో ద‌క్కింది. వికాస్ బెహ‌ల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ర‌ష్మిక చాలా కీల‌క పాత్ర పోషిస్తుంది.

న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న ఫుల్ లెంగ్త్ పాత్ర‌లో ఆక‌ట్టుకోనుంది. సినిమా స‌క్సెస్ అయితే గ‌నుక అమ్మ‌డికి మంచి పేరొస్తుంది. కాగా ఈ సినిమా కూడా `మిష‌న్ మ‌జ్ను`కి వారం గ్యాప్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అదే నిజ‌మైతే ర‌ష్మిక బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్లే. మ‌రోవైపు కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. అన్నీ లైన‌ప్ లోకి వ‌స్తే టాలీవుడ్ లోనే ర‌ష్మిక కి సినిమాలు చేసే స‌మ‌యం దొర‌క‌దు.