Begin typing your search above and press return to search.
ఆ ఇంటి భోజనం సూపర్.. వాళ్లబ్బాయితోనే నా పెళ్లిః రష్మిక
By: Tupaki Desk | 13 May 2021 10:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ ఎవరంటే వినిపించే పేర్లలో రష్మిక టాప్ ప్లేస్ లో ఉంటుంది. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తక్కువ గ్యాప్ లోనే నెంబర్ వన్ రేసులోకి దూసుకెళ్లిందీ భామ. 2008లో విడుదలైన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఆ తర్వాత వరస విజయాలు అందుకుంది.
గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్స్ లో నటించింది ఈ బ్యూటీ. సుకుమార్- బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య తన డ్రీమ్ రోల్ ఏంటని అడిగితే.. దివంగత శ్రీదేవి బయోపిక్ లో నటించడమేనని చెప్పింది రష్మిక.
అయితే.. తాజాగా తన లైఫ్ డెస్టినేషన్ ఎక్కడికో కూడా చెప్పేసిందీ బ్యూటీ! తన జీవిత గమ్యం తమిళనాడేనని చెప్పడం గమనార్హం. ఈ కన్నడ బ్యూటీ.. ఈ మధ్యనే కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరో కార్తీ లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’తో తమిళనాట అరంగేట్రం చేసిందీ బ్యూటీ. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. ఈ అమ్మడికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను పెళ్లంటూ చేసుకుంటే తమిళ అబ్బాయినే చేసుకుంటానని చెప్తోంది రష్మిక. అదేంటీ..? కర్నాటక బ్యూటీకి తమిళనాడుపై ఎందుకంత మోజు అంటారా? ఆమెకు తమిళనాడు అంటే చాలా ఇష్టమట. అక్కడి ప్రజలు, వారి సంప్రదాయం కూడా ఆమెను బాగా ఆకర్షిస్తాయట. ఇక, మరీ ముఖ్యంగా.. అక్కడి వంటకాలు విపరీతమైన ఇష్టమట!
అందుకే.. ఎప్పటికైనా తమిళనాడు వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉందట! మరీ.. భోజనం కోసం పెళ్లి చేసుకోవడమేంటీ? ఇదేం విడ్డూరం అంటారా? ఆమె పర్సనల్ లైఫ్ ను మనం ఎలా కాదంటాం చెప్పండి? అసలే భోజన ప్రియురాలు కూడానూ! అందుకే.. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.