Begin typing your search above and press return to search.
దుల్కర్ జోడీగా దుమ్మురేపేయనున్న రష్మిక!
By: Tupaki Desk | 25 Sep 2021 4:30 AM GMTతెలుగులోని అందమైన కథానాయికలలో .. అదృష్టం కలిసొచ్చిన కథానాయికలలో రష్మిక ఒకరుగా కనిపిస్తుంది. తెరపై చాలా యాక్టివ్ గా కనిపించే రష్మిక .. బయట అవకాశాలను అందుకోవడంలోను అంతే యాక్టివ్ గా కనిపిస్తుంది. చురుకైనది .. తెలివైనది కనుకనే అవకాశాలను అల్లుకుపోతోంది .. అభిమానుల హృదయాలను గెలుచుకుపోతోంది. తన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. ప్రతి అవకాశం తనని ఓ మెట్టు పైకి చేర్చేలానే ప్లాన్ చేస్తోంది. అందువల్లనే అమ్మడి చేతిలో ఇప్పుడు మంచి ప్రాజెక్టులు ఉన్నాయి.
'సరిలేరు నీకెవ్వరు' .. 'భీష్మ' వంటి భారీ విజయాలను వెంటవెంటనే అందుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత సినిమాగా 'పుష్ప' చేస్తోంది. గిరిజన గూడానికి చెందిన యువతి పాత్రలో మరోసారి కుర్రాళ్ల మత్తు వదల్చడానికి రెడీ అవుతోంది. ఆ తరువాత శర్వానంద్ జోడీగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో ఉంది. ఇక తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న సినిమాలోను ఆమె మెరవనుందనేది తాజా సమాచారం. ఇటీవలే ఈ సినిమా చేయడానికి ఈ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
దుల్కర్ సల్మాన్ హీరోగా స్వప్న సినిమా .. వైజయంతి మూవీస్ వారు ఒక సినిమాను నిర్మిస్తున్నారు. అందుకు సంబంధించిన పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. 'అందాల రాక్షసి' సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి, 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. ఆ తరువాత నుంచి ఆ స్థాయి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజా ప్రాజెక్టులో ఒక కథానాయికగా రష్మిక అలరించనుండగా, మరో కథానాయికగా మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. ఇటీవల ఆమె బర్త్ డే రోజున ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు కూడా.
ఈ సినిమా తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లోను ప్లాన్ చేశారట. ఆ తరువాత షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతుందని అంటున్నారు. ఇక కథ మేరకు విదేశాల్లోను షూటింగు జరుపుకోనుంది. 'రష్యా'లో జరిగే షెడ్యూల్లో రష్మిక జాయిన్ అవుతుందని చెబుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో సాగే ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళ .. మలయాళ భాషల్లోను విడుదల చేయనున్నారు. దుల్కర్ సల్మాన్ - రష్మిక జోడీ తెరపై ఒక రేంజ్ లో సందడి చేయవచ్చని అభిమానులు అప్పుడే సాంగ్స్ వేసుకుంటున్నారు.