Begin typing your search above and press return to search.
కొత్త పిల్లతో రామ్ సరసాలు షురూ
By: Tupaki Desk | 10 May 2017 6:15 AM GMTరొటీన్ సినిమాతో రొటీన్ గా ఫ్లాపులు కొట్టేసి.. ఇప్పుడు హిట్టు కోసం తహతహలాడుతున్నాడు రామ్. అయితే ఈసారి కరుణాకరన్ తో ఒక సినిమా అనుకుని.. ఆ సినిమా మధ్యలో ఉండగానే ఇప్పుడు కిషోర్ తిరుమలతో జతకట్టాడు. 'నేను శైలజ'తో మంచి రైటర్ డైరక్టర్ అనిపించుకున్న తిరుమల కూడా ఆ తరువాత ఏ ప్రాజెక్టునూ టేకాఫ్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరికీ కలిపి ఒక మంచి హిట్టు కావాలి.
అందుకే ఈ సినిమాను అన్ని విధాలుగా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటున్నారు రామ్. ఈ సినిమాలో హీరోయిన్ గా చాలామంది స్టార్లను అనుకున్న తరువాత.. ఎవరన్నా క్రేజీ కొత్తమ్మాయి అయితే బాగుంటుందని ఫీలయ్యాడట. అందుకే తెలుగులో 'సాహో' సినిమాలో చేస్తోందంటూ ఫ్రీ పబ్లిసిటీ కొట్టేసిన కన్నడ బ్యూటి రష్మిక మందన్నాను తీసుకున్నాడు. ఒక కొత్త ఫేస్ తో సరసాలాడితే ఖచ్చితంగా ప్రాజెక్టుకు కొత్త కలర్ వస్తుందని ఆల్రెడీ కీర్తి సురేష్ ను దించేసి నేను శైలజతో ప్రూవ్ చేశారు ఈ డైరక్టర్ అండ్ హీరో. అందుకే మళ్ళీ సేమ అలాంటి ఫీటే రిపీట్ చేస్తున్నారు.
రష్మిక కన్నడలో కిర్రాక్ పార్టీ సినిమా చేసిన తరువాత సూపర్ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో చేయట్లేదు కాని.. తెలుగులో నాగశౌర్య సినిమాతో డెబ్యూ చేస్తోంది. ఇదిగో రామ్ సినిమా కూడా పట్టేసింది. ఆల్రెడీ బెంగుళూరు నుండి హైదరాబాద్ వచ్చేసి అమ్మడు షూటింగ్ కూడా చేసి వెళుతోందట. ఇకపోతే చాలామంది కన్నడ హీరోయిన్లు.. ప్రణీత.. కృతికర్భందా.. సంజన వంటి భామలు ఈ మధ్య కాలంలో తెలుగులో క్లిక్ అవ్వడానికి ఇబ్బందులు పడుతున్నారు. మరి రష్మిక ఏం చేస్తుందో చూడాలి.