Begin typing your search above and press return to search.

'లైగర్' మూవీ తెగ నచ్చేసిందన్న లక్కీ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   1 Oct 2022 3:42 PM GMT
లైగర్ మూవీ తెగ నచ్చేసిందన్న లక్కీ బ్యూటీ..!
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్' మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రాన్ని అన్ని భాషల ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. అయితే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కు ఈ సినిమా తెగ నచ్చిందని చెబుతోంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'గుడ్‌ బై' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రమోట్ చేస్తోంది రష్మిక.

ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ యూట్యూబర్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. రష్మిక తన ఫ్రెండ్ విజయ్ దేవరకొండ 'లైగర్' పరాజయం పాలైనప్పుడు ఆమెకు ఏమి అనిపించిందని అడిగాడు. దీనికి రష్మిక స్పందిస్తూ.. తనకు మాస్ మూవీలంటే చాలా ఇష్టమని.. 'లైగర్' సినిమా చూస్తూ విజిల్స్ వేసి డాన్స్ చేశానని తెలిపింది.

''విజయ్ తో కలిసి 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్ సినిమాలు చేశాను. దీంతో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడు అందరూ 'రష్మిక - విజయ్ దేవరకొండ' అంటూ మా గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది'' అని రష్మిక చెప్పింది.

''లైగర్ సినిమా ఇటీవల చూశాను. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. నాకు మాస్ సినిమాలు చాలా ఇష్టం. 'లైగర్' చూస్తున్నప్పుడు.. విజిల్స్ వేశాను. డ్యాన్స్ చేశాను. రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా నాకు ఎంతో నచ్చింది. విజయ్ అదరగొట్టేశాడు. ఫిటెనెస్ పై అతడు ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వెల్ డన్ విజయ్" అని రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది.

ఈ ఇంటర్వ్యూ క్లిప్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ లో హల్‌ చల్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన 'లైగర్' సినిమా నచ్చిందని చెప్పడంతో.. కొందరు నెటిజన్లు ఆమె సినిమాల ఎంపికపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం రష్మిక ఎలాంటి పరిస్థితుల్లోనూ తన ఫ్రెండ్ విజయ్ సినిమాను సపోర్ట్ చేయడం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

నిజానికి విజయ్ మరియు రష్మిక మధ్య సంబంధం గురించి చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి. 'గీత గోవిందం' చిత్రంలో కలిసి నటించిన ఈ జంట.. వెంటనే 'డియర్ కామ్రేడ్' లో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. అలానే తరచుగా ఇద్దరూ కలిసి చక్కర్లు కొడుతూ కెమెరా కళ్ళకు చిక్కడంతో రకరకాల వార్తలు షికార్లు చేశాయి.

కాకపోతే రష్మిక - విజయ్ ఇద్దరూ ఇప్పటికే తమపై వస్తున్న రూమర్స్ పై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. రెండు సినిమాలు కలిసి చేసే క్రమంలో తామిద్దరం మంచి స్నేహితులమయ్యామని చెప్పారు. కెరీర్ గురించి కష్టసుఖాలపై మాట్లాడుకుంటామని.. తమ మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని పేర్కొన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.